G. Madhusudhan reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్‌లోకి వచ్చి ఏడాది అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. భారీ ఎత్తున పదవుల భర్తీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని డీసీసీ పదవిపై నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పైచేయి సాధించేందుకు పోటీ ముమ్మరం చేశారట. తమ అనుచరులకు సీటు ఇప్పించుకుని జిల్లాలో చక్రం తిప్పాలని భావిస్తున్నారట. అయితే ఇద్దరు నేతల మధ్య డీసీసీ సీటు మాత్రం హీట్ పుట్టిస్తోందట. ఇద్దరు ఎమ్మెల్యేలు డీసీసీ విషయంలో ఢీ అంటే ఢీ అంటుండటంతో.. పదవి ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఉన్నారు. మరోసారి జిల్లాలో తన పట్టు సాధించేందుకు తన వర్గానికి చెందిన ఓ నేతకు పదవి ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కూడా డీసీసీ పదవిపై కన్నేసినట్టు సమాచారం. ఈసారి తమకు ఓ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నామినేటేడ్ పోస్టుల విషయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిదే పైచేయి అయ్యిందట. అందుకుగానూ ఈసారి తమకే డీసీసీ పోస్టు ఇవ్వాలని జీఎంఆర్ పార్టీ పెద్దలను కోరుతున్నారట.. అయితే ఇద్దరు నేతలు తమ లాబీయింగ్‌ను ముమ్మరం చేయడంతో పార్టీ పెద్దలు ఈ పోస్టును ఎవరికి ఇవ్వాలో తెలియక పార్టీ హైకమాండ్ మాత్రం మధ్యే మార్గంగా మరోనేత కోసం అన్వేషణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 14 సీట్లకు గానూ 12 చోట్ల హస్తం పార్టీ హవా కనిపించింది. అప్పటికే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జీఎంఆర్ కూడా దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో కొత్త అధ్యక్షుడిగా కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ కొందరు నేతల పేర్లను పరిశీలిస్తోందట. దాంతో తమ అనుచరులకే డీసీసీ దక్కించుకోవాలని పార్టీ నేతలు పావులు కదుపుతున్నారట. ఇక రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్ధల ఎన్నికలు రాబోతున్నాయి. అంతలోపు కొత్త అధ్యక్షుడి నియామకం జరిగితే.. జిల్లాలో చక్రం తిప్పాలని ఇద్దరు ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది.
మొత్తంగా ఇద్దరు నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా.. మరోవర్గం తీవ్ర అసంతృప్తికి గురయ్యే చాన్స్ ఉందని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుందట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆసంతృప్త జ్వాలలు లేకుండా ఇష్యూను కూల్‌గా డీల్ చేసేందుకు ప్రయత్నిస్తుట్టు సమాచారం. ఒకవేళ ఇద్దరు నేతలు తగ్గని పక్షంలో మరో నేతకు అవకాశం ఇచ్చే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారట. ఈ విషయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యలతో ఓసారి సమావేశం నిర్వహించిన బుజ్జగించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో డీసీసీ పీఠం ఏ నేతకు దక్కెనో..!
Also Read: Telangana Liquor Prises: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
Also Read: KT Rama Rao: తప్పుడు కూతలు కూస్తోన్న రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.