హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు, తాజా పరిణామాలపై నేడు జనగామ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను వివరాలు ప్రజలనడిగి తెలుసుకున్నారు. కాగా, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమం, అందులో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల పై మంత్రి ఆరా తీశారు.
MA&UD Minister @KTRTRS addressed the gathering at the #PattanaPragathi program in Jangaon town today. pic.twitter.com/mrhM5hfKvE
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 26, 2020
బస్తీలో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది తో కాసేపు ముచ్చటించారు. పట్టణంలో మరిన్ని స్వచ్ఛ వాహనాలతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
MA&UD Minister @KTRTRS interacted with the councillors and ward committee members at the #PattanaPragathi program in Bhongir town. MLA Pailla Shekar Reddy, MLC's Alimineti Krishna Reddy, Naveen Rao were present. pic.twitter.com/Z0njKsOs38
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 26, 2020
మరోవైపు మంత్రి కేటీఆర్ భువనగిరి చేరుకోగా.. స్థానిక ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ అనిత రామచంద్రన్ లు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గంతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్ ను కలిసేందుకు అభిమానులు పార్టీ కార్యకర్తలు బారులు తీరారని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..