Nagarjuna: హైడ్రా దెబ్బ.. బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. ?

Nagarjuna - Bigg Boss: రీసెంట్ గా ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన పలు కట్డడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో హైటెక్ సిటీ సమీపంలోని  నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ప్రభుత్వం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ హోస్ట్ నుంచి నాగార్జున ను తప్పించే ఆలోచన చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 26, 2024, 11:28 AM IST
Nagarjuna: హైడ్రా దెబ్బ.. బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. ?

Nagarjuna - Bigg Boss: నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్.. గూగుల్ మ్యాప్ సహాయంలో అక్రమ నిర్మాణాలను కూల్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ లో తుమ్మడి కుంట చెరువును ఆక్రమించి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మాత్రం చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమంగా  నిర్మించినట్టు నిర్ధారణ చేసుకొని మరి ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చినట్టు చెప్పుకొచ్చారు. మరవైపు నాగార్జున మాత్రం తాను పట్టా భూమిలో ఎలాంటి ఆక్రమణలు లేకుండా ఎన్ కన్వెన్షన్  సెంటర్ ను నిర్మించినట్టు చెబుతున్నారు.తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు.అందుకే న్యాయం కోసం కోర్టుకు వెళ్లినట్టు చెప్పుకొచ్చారు.

మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేత ఘటన పై బిగ్ బాస్ హోస్ట్ సీటుకు ఎసరు తెచ్చేలా ఉందా అంటే ఔననే అంటున్నాయి బిగ్ బాస్ వర్గాలు.  ఈ సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు షో నుంచి నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాల‌ని బిగ్‌బాస్ సీజ‌న్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హైద‌రాబాద్‌లోని తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి నాగార్జున ఎన్ క‌న్వెన్షన్‌ను నిర్మించార‌ని హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో బాబు గోగినేని ట్వీట్ చేశారు.

అక్రమ కట్టడాలకు సంబంధించి దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న షో హోస్ట్ ను నిర్వహకులు తక్షణమే మార్చాలంటూ నాగార్జున‌ను ఉద్దేశించి బాబు గోగినేని కామెంట్ చేశారు. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జున‌ను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్‌లో బాబు గోగినేని పేర్కొన్నారు. ఎలిమినేట్ హిమ్, బిగ్ బాస్...ఇట్లు.. మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ రాసుకొచ్చారు.

N-కన్వెన్షన్ కూల్చివేతలపై హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. N-కన్వెన్షన్ కి  సంబంధించి  వస్తున్న వార్తల్లో  వాస్తవాల కంటే,  ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయన్నారు. పట్టా డాక్యుమెంటెడ్ భూమిలోనే కన్వెన్షన్ నిర్మించామన్నారు. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమించి కట్టలేదని స్పెషల్ కోర్టు 2014లో తీర్పు చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించనట్లు వెల్లడించారు. కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అప్పటి దాకా ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలు నమ్మద్దని కోరుతూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News