New ration cards in telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కారు ఎట్టకేలకు గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించుకుంది. మంగళవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో లాక్‌డౌన్ పొడిగింపుతో పాటు పలు ఇతర అంశాలపై కూడా చర్చించిన కేబినెట్.. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సానుకూల నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు 15 రోజుల్లోగా రేషన్ కార్డులు (Ration cards applications) మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
Also read : PRC approved in TS: ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు Good news.. PRCకి కేబినెట్ ఆమోదం
New ration cards applications - కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల సంగతేంటి ?
అయితే ఇదివరకు దరఖాస్తు చేసుకున్న వారికి మరో 15 రోజుల్లోగా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇంకా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన వారి పరిస్థితి ఏంటనే అంశంపైనా చర్చ జరిగింది. మళ్లీ కొత్తవారికి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలనే అంశంపైనా (How to apply for new ration cards) త్వరలోనే ఓ స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.
Ration dealers demands - రేషన్ డీలర్ల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రేషన్ డీలర్ల కమీషన్ పెంపు సహా అనేక ఇతర సమస్యలపై రాష్ట్రంలోని రేషన్ డీలర్లు ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ రేషన్ డీలర్లు పలుమార్లు రోజుల తరబడి ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో రేషన్ డీలర్ల సమస్యలతో పాటు మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారం, లోపాలను సవరించే దిశగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వం వహించనున్న ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు (Minister Harish Rao), తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also read: Telangana lockdown timings: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..లాక్‌డౌన్ కొత్త టైమింగ్స్
Telangana special food processing zones - తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు:
తెలంగాణలో రైతన్నలు పండించే ప్రతీ పంటకు డిమాండ్ ఏర్పడేలా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి 9 జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఒక్కొక్కటి కనీసం 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లులు, ఇతర పంటల పంటలపై ఆధారపడే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు చోటు దక్కనుంది.
Also read: Telangana: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook