TRS Rajyasabha Race: మూడు రాజ్యసభ స్థానాలు.. రేసులో 10 మంది నాయకులు

మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా.. పది మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశం లభిస్తోందా.. లేక పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 01:57 PM IST
  • మూడు రాజ్యసభ స్థానాలకు రేసులో పది మంది నేతలు
  • ప్రచారంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ పేరు కూడా ఉంది
  • రేసులో ఉన్న సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
TRS Rajyasabha Race: మూడు రాజ్యసభ స్థానాలు.. రేసులో 10 మంది నాయకులు

TRS Rajyasabha Race: టీఆర్ఎస్‌లో రాజ్యసభ సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా.. పది మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశం లభిస్తోందా.. లేక పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా.. అనే టాక్‌ నడుస్తోంది. సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకొని.. అనూహ్యంగా కొన్ని పేర్లు తెరపైకి రావొచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ  స్థానాల భర్తీపై చర్చ ఊపందుకుంది. డి. శ్రీనివాస్, లక్ష్మీకాంతరావు పదవీకాలం జూన్‌లో గడువు ముగియనుంది. రాజ్యసభకు రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికయ్యారు బండ ప్రకాష్. రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభలో అడుగు పెట్టేందుకు పలువురు టీఆర్ఎస్ నేతలు ఆసక్తీ చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మెప్పించి ఒప్పించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి విధేయంగా ఉన్నామంటూ కొందరు కేసీఆర్‌పై నమ్మకంతో ఉన్నారు. ఇదే తరుణంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ వచ్చిన నేతలు రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. రాజ్యసభ రేసులో పలువురి పారిశ్రామికవేత్తల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో పలు సందర్భాల్లో వినిపించిన పారిశ్రామికవేత్త హెటిరో డ్రగ్స్‌ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు పేర్లు సారి తెరపైకి వచ్చాయి.

రాజ్యసభ స్థానాల ఎంపికలో సామాజిక సమీకరణాలతో పాటు భవిష్యత్‌ రాజకీయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. దేశ రాజధాని ఢిల్లీలో అవసరాలు.. ఇతర పార్టీలతో సంబంధాలను బేరిజు వేయవచ్చని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఢిల్లీలో రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ.. ఇటీవల ముంబై పర్యటనలో ఆకస్మాతుగా ప్రత్యక్షమైన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ పేరు కూడా ప్రచారంలో ఉంది. సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును పరిశీలించవచ్చని టీఆర్ఎస్‌ భవన్‌ వర్గాల సమాచారం.

సుదీర్ఘ కాలంగా పదవులకు దూరమైన సీనియర్‌ నేతలు ఖమ్మం మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొందరు రిటైర్డ్‌ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు..పెద్దిరెడ్డి వంటి సీనియర్ నేతలు రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. పదవలు భర్తీలో ప్రతీసారి అంచనాలకు అందని విధంగా అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించే కేసీఆర్.. రాజ్యసభ టికెట్‌ల ప్రచారానికి భిన్నంగా వ్యవహరించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీ పార్టీలో సీనియర్ నేతలు అంటున్నారు.

Also Read: Telangana Weather: తెలంగాణలో ఆ 6 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...

Also Read: King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News