Bheemla Nayak: ‘'భీమ్లా నాయ‌క్'’ టికెట్ కోసం.. పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్య..!

pawan kalyan fan: అభిమానం ఓ కుర్రాడి ప్రాణాలు తీసింది. సినిమా టికెట్ కొనుక్కోవడానికి డబ్బులివ్వలేదని ఓ బాలుడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 02:26 PM IST
  • జగిత్యాలతో విషాద ఘటన
  • సినిమా టికెట్ కోసం బాలుడి ఆత్మహత్య
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Bheemla Nayak: ‘'భీమ్లా నాయ‌క్'’ టికెట్ కోసం.. పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్య..!

Pawan Kalyan fan commits suicide : హీరోపై అభిమానం ఉండొచ్చు. మరి ప్రాణాలు తీసుకునేంత కాదు. సినిమా పిచ్చి ఉండొచ్చు..మరీ చనిపోయింత కాదు. సినిమా టికెట్ కొనుక్కోవడానికి డబ్బులివ్వలేదని ఓ బాలుడి ఆత్మహత్య (fan commited suicide) చేసుకున్న ఘటన జగిత్యాలలో (Jagityala) వెలుగులోకి వచ్చింది. 

తెలంగాణ జగిత్యాలలోని పురానీపేటకు చెందిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆ కుర్రాడు పవన్ క‌ళ్యాణ్‌కు (Pawan Kalyan) వీరాభిమాని. అయితే ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రం '‘భీమ్లా నాయక్'’(Bheemla Nayak). ఇందులో రానా ద‌గ్గుబాటి మరో పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఇస్తున్నారని తెలుసుకున్న ఆ కుర్రాడు ఎలాగైనా టికెట్ సంపాదించి మూవీ చూడాలనుకున్నాడు. 

టిక్కెట్ కోసం రూ. 300 కావాలని తండ్రిని అడిగాడు. అయితే ఆ పిల్లాడి తండ్రి రోజువారీ కూలీ కావడంతో అంత డబ్బు తన వద్ద లేదని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రేమ‌గా పెంచుకున్న కొడుకు ఉరికి వేళాడుతూ కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Ghani Release Date: వరుణ్ తేజ్ 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్... ఎప్పుడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News