Rahul Telangana Tour: రెండు రోజులు.. కీలక భేటీలు! రాహుల్ గాంధీ షెడ్యూల్ ఇదే..

Rahul Telangana Tour: రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ సభ విజయవంతం కోసం పీసీసీ చీఫ్ జిల్లాల వారీగా సన్నాహాక సమావేశాలు  నిర్వహిస్తున్నారు

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 03:44 PM IST

    మే6న సాయంత్రం వరంగల్ లో రాహుల్ బహిరంగ సభ

    వరంగల్ నుంచి రోడ్డు మార్గానా హైదరాబాద్ కు రాహుల్

    దుర్గం చెరువు దగ్గరున్న హోటల్ కోహినూర్ లో రాహుల్ బస

Rahul Telangana Tour: రెండు రోజులు.. కీలక భేటీలు!  రాహుల్ గాంధీ షెడ్యూల్ ఇదే..

Rahul Telangana Tour: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మే 6న సాయంత్రం నాలుగు గంటలకు  ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్నారు రాహుల్‌గాంధీ. శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ హాజరుకానున్న వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్‌గాంధీ, ఇతర నేతలకు ఒకటి.. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక నిర్మిస్తున్నారు. వరంగల్ సభలో సాయంత్రం ఏడు గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగాలు ఉంటాయి. చివరగా రాహుల్ గాంధీ మాట్లాడుతారు. సభ తర్వాత వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళతారు రాహుల్ గాంధీ. మే6వ తేది రాత్రి హైటెక్ సిటిలోని దుర్గం చెరువు పక్కనున్న కోహినూర్ హోటల్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు.

మే7వ తేది ఉదయం హోటల్ కోహినూర్ లో టీపీసీసీ ముఖ్య నాయకులతో అల్పాహార సమావేశం నిర్వహిస్తారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి సంజీవయ్య పార్క్ కు వెళతారు. సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తారు. అటు నుంచి  గాంధీ భవన్ వెళతారు రాహుల్ గాంధీ. దాదాపు 200 మంది పీసీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల కార్యాచరణపై తెలంగాణ నేతలకు రాహుల్ దిశా నిర్గేశం చేస్తారు. రాహుల్ రాక సందర్భంగా గాంధీభవన్ లో డిజిటల్ మెంబర్ షిప్ ఎన్ రోలర్స్ తో ఫొటో సెషన్ ఏర్పాటు చేయనున్నారు పీసీసీ నేతలు. ఆ తరువాత తెలంగాణ అమరవీరుల తో రాహుల్ గాంధీ లంచ్ మీటింగ్ ఉంటుంది. అనంతరం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఢిల్లీకి తిరుగు పయనమవుతారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ సభ విజయవంతం కోసం పీసీసీ చీఫ్ జిల్లాల వారీగా సన్నాహాక సమావేశాలు  నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ భావించింది. అయితే రాహుల్ పర్యటనకు ఉస్మానియా వీసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో రాహుల్ ఓయూ పర్యటనపై ఇంకా క్లారిటీ రావడం లేదు.

READ ALSO: Narayana On Ktr: మోడీ వల్లే కేటీఆర్ మాట మార్చారు.. సీపీఐ నారాయణ సంచలనం...

Yadadri Parking Fee: యాదాద్రికి కారులో వెళ్తున్నారా.. పార్కింగ్ ఫీజు తెలిస్తే చుక్కలు కనిపించడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News