Rains Live Updates : Heavy rainfall expected in these districts in telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని (telangana) పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు (Tamil Nadu) తీరం వద్ద ఉన్న అల్పపీడనం నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడనుంది. ఆ తర్వాత అది వాయుగుండంగా మారనుంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికల్లా ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉంది.
Also Read : వరి వార్: కేంద్రంపై కేసీఆర్ ప్రశ్నల వర్షం.. కుండబద్దలు కొట్టిన సర్కార్..ఏమన్నారంటే?
అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణలోకి (telangana) కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో గురువారం రాత్రి, శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం రాత్రి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి (Wanaparthi), నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయి.
ఇక శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉంది.
Also Read : కార్తిక పౌర్ణమి 2021: దేవ్ దీపావళి అంటే ఏంటి ? దేవుళ్లకు వేరే దీపావళి ఉందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook