Musi River: మూసీ నదికి తగ్గిన వరద ప్రవాహం..ఊపిరి పీల్చుకున్న నగరవాసులు..!

Musi River: మూసీ నది కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన నదికి వరద తగ్గుతోంది. క్రమేపి సాధారణ స్థితి వస్తుందని అధికారులు తెలిపారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 29, 2022, 12:33 PM IST
  • మూసీకి తగ్గిన వరద
  • దిగువకు నీటి విడుదల
  • నగరంలో సాధారణ స్థితి
Musi River: మూసీ నదికి తగ్గిన వరద ప్రవాహం..ఊపిరి పీల్చుకున్న నగరవాసులు..!

Musi River: గత వారం రోజులుగా భాగ్యనగర వాసులను భయపెట్టిన మూసీ నది..తగ్గుముఖం పట్టుతోంది. ఇవాళ నది సాధారణ స్థితికి రానుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ముంపు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మూసీ నది ఉధృతితో పరివాహక ప్రాంత ప్రజలు వరద నీటిలోనే జీవనం సాగించారు. ఇళ్ల మధ్య నుంచే భారీగా వరద నీరు పరవళ్లు తొక్కింది.

వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో బురద తొలగించే పనిలో స్థానికులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం క్రేన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో సాధారణ స్థితి రావడానికి ఇంకా వారం రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో మూసీ ప్రాజెక్ట్‌ను వరద పోటు తగ్గింది. దీంతో మూడు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ ఫ్లో 9 వేల 960.60 క్యూసెక్కులుగా..ఔట్ ఫ్లో 6 వేల 783.67 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 637.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 2.73 టీఎంసీలుగా ఉంది.

మరోవైపు తెలంగాణలో వర్ష సూచన కొనసాగుతోంది. రాగల మూడురోజులపాటు వర్షాలు పడతాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఎల్లుండి మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇటు హైదరాబాద్‌లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Also read:Ashwini Dutt:నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన అశ్వినీదత్

Also read:Crane Accident: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం..ఐదుగురు దుర్మరణం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News