Ex Minister Srinivas Goud: చిక్కుల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. ఒక్కొక్కటిగా వెలుగులోకి అక్రమాలు..!

Ex Minister Srinivas Goud News: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమయంలో జరిగిన అవినీతిపై సీరియస్‌గా ఉంది. ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌ను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 25, 2024, 12:45 PM IST
Ex Minister Srinivas Goud: చిక్కుల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. ఒక్కొక్కటిగా వెలుగులోకి అక్రమాలు..!

Ex Minister Srinivas Goud News: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది. మంత్రిగా శ్రీనివాస్ గౌడ్‌ ఉన్న సమయంలో జరిగిన అడ్డగోలు దందాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ పాలనలో డబుల్ బెడ్‌ రూం ఇండ్ల పంపకంలో అక్రమార్కులకు పట్టాలు అందజేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తమ్ముడు శ్రీకాంత్‌ గౌడ్‌ను అరెస్టు చేసేందుకు సిద్దమైనట్టు సమాచారం. అయితే పోలీసులు అరెస్టు చేస్తారన్న ముందస్తు సమాచారంతో శ్రీకాంత్‌ గౌడ్‌ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read: Konda Vs KTR: కేటీఆర్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు..
 
ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా శ్రీనివాస్‌ గౌడ్‌ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2018 లోనూ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో శ్రీనివాస్‌ గౌడ్‌ భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మహబూబ్ నగర్‌ జిల్లా కేంద్రంలో భారీగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో చాలా వరకు లబ్ధిదారులకు దక్కకుండా తమ అనుచరులకే ఇప్పించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతేకాదు మహబూబ్‌ నగర్‌ మున్సిపాలిటీలో అభివృద్ది పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని గుర్తించారు. దాంతో శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు.. మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. A-4గా ఉన్న శ్రీకాంత్‌ గౌడ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు జరుపుతున్నారు. 
 
మరోవైపు మహబూబ్‌ నగర్‌లో శ్రీనివాస్ గౌడ్‌కు చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో లోకల్‌ బీఆర్‌ఎస్‌ నేతలను స్థానిక ఎమ్మెల్యే యోన్నం శ్రీనివాస్‌ రెడ్డి తమవైపు తిప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కొందరు కౌన్సిలర్లు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఎన్నికల్లోపు కారు పార్టీని ఖాళీ చేయించే ఆలోచనలో ఎమ్మెల్యే యెన్నం ప్రణాళికలు రచిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాస్‌ గౌడ్‌ అక్రమాలను వెలికి తీయడం ద్వారా ఆయనకు చెక్‌ పెట్టొచ్చనే ఎమ్మెల్యే స్పీడ్ పెంచినట్టు సమాచారం. అందుకే శ్రీకాంత్‌ గౌడ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు తెగ వెతుకుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శ్రీకాంత్‌ గౌడ్‌ దేశం వదిలి పారిపోయారని టాక్ సైతం వినిపిస్తోంది.. 
 
మొత్తంగా మహబూబ్‌ నగర్‌ లో షాడో మంత్రిగా ఇన్నాళ్లు చెలరేగిపోయిన శ్రీకాంత్‌ గౌడ్‌కు చెక్ పెట్టాలని ఎమ్మెల్యే యెన్నం ప్లాన్ చేస్తున్నారట.. మున్సిపల్‌ ఎన్నికల్లోపు శ్రీకాంత్‌ గౌడ్‌ను జైలుకు పంపితే మున్సిపల్‌ ఎన్నికల్లో సునాయసంగా గెలుపొందొచ్చని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే శ్రీనివాస్‌ గౌడ్‌ మరిన్ని అక్రమాలను బయటకు లాగే యోచనలో ఉన్నారట.. చూడాలి మరి స్థానిక ఎమ్మెల్యే స్పీడ్‌కు శ్రీనివాస్‌ గౌడ్‌ తట్టుకుంటారా..! లేదంటే ప్రభుత్వానికి సరెండర్‌ అవుతారా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Also Read: Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News