Jagga Reddy Arrest: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్.. ఉస్మానియాలో టెన్షన్

Jagga Reddy Arrest:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయ కాక రేపుతోంది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ వెళుతుండగా జగ్గారెడ్డిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 04:27 PM IST

    కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

    ఓయూ వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు

    ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళన

 Jagga Reddy Arrest: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్.. ఉస్మానియాలో టెన్షన్

Jagga Reddy Arrest:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయ కాక రేపుతోంది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ వెళుతుండగా జగ్గారెడ్డిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. మే6న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా మే7న ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ కు పీసీసీ నేతలు ప్లాన్ చేశారు. అయితే ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించారు వీసీ. యూనివర్శిటీలో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని ప్రకటించారు. ఉస్మానియా వీసీ తీరుకు నిరసనగా ఎన్ఎస్ యూఐ నేతలు క్యాంపస్ లో ఆందోళన చేస్తున్నారు.

ఓయూలో నిరసనకు దిగన నేతలను పరామర్శించేందుకు బయలుదేరారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీంతో అతన్ని మధ్యలోనే అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఉస్మానియా యూనివర్శిటీలోకి ఎవరికి అనుమతి లేదని చెప్పారు. పోలీసుల తీరుపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

READ ALSO: Rahul Telangana Tour: రెండు రోజులు.. కీలక భేటీలు! రాహుల్ గాంధీ షెడ్యూల్ ఇదే..

Botsa Electricity bills Issue: మంత్రి బొత్స కరెంట్ బిల్లులు కట్టలేదా..? డిస్కం సీఎండీ క్లారిటీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News