Telangana 2023-24: ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కులగణనపై ఫోకస్!

Telangana: వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కులగణన బిల్లు కీలకం కానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 12:22 PM IST
Telangana 2023-24: ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కులగణనపై ఫోకస్!

Telangana 2023-24 Budget Session: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువదీరిన తర్వాత తొలి సారి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది.  ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాల నిర్వహించేందుకు రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మోదీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో  తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలా అన్న దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ను బడ్జెట్ ను ప్రవేశపెడితే.. పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. దీనికి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడితే బడ్డెట్‌ సమావేశాలు 4-5 రోజులకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈసారి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారం తర్వాత విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఆలోపే బడ్జెట్ సమావేశాలు ముగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే బడ్జెట్ కూర్పుపై విస్తృతంగా కసరత్తు జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు సహా... కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాలతో బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Batti Vikramarka) అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

కీలకంగా కులగణన..
మరోవైపు ఈ బడ్జెట్‌ సమావేశాలల్లో తెలంగాణలో బీసీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కులగణనపైనా బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ సైతం కులగణన కచ్చితంగా జరిపి తీరుతామని పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహూల్‍ (Rahul Gandhi) సైతం న్యాయ్‌ యాత్రలో పదేపదే కులగణనపై ప్రజలకు హామీలు ఇస్తున్నారు. బిహార్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన పూర్తయింది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్రాలకు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపింది రేవంత్ ప్రభుత్వం. దాదాపు వందేళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం కులగణన చేప్టటగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో కులగణన జరగలేదు. 

Also Read: Sanjay Vs KTR: పాత సామానోళ్లు కూడా 'కారు'ను కొనరు: కేటీఆర్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్‌

Also Read: Ration Card e-Kyc: రేషన్ కార్డుల ఇ కేవైసీ గడువు పెంపు, ఎలా చేస్తారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News