తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వర్ష సూచన !

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ 

Last Updated : May 9, 2018, 09:19 PM IST
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వర్ష సూచన !

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం సూచించింది. ఈ వర్షాలకు తోడు భారీగా ఈదురు గాలులు కూడా వీచే అవకాశం వున్నట్టు వాతావరణ కేంద్రం నివేదిక పేర్కొంది. ఈ నేవేదికలోని సమాచారం ప్రకారం తెలంగాణ, రాయలసీమలోని అన్ని జిల్లాలో ఈ వర్షాలు కురవనున్నాయి. అంతేకాకుండా విజయనగరం జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా సహా కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో వర్షాలు కురవనున్నాయి. రానున్న ఐదు రోజులపాటు తెలంగాణ, ఏపీ, రాయలసీమ ప్రాంతాల్లో ఈ వాతారణ ప్రభావం కనిపించే అవకాశాలు లేకపోలేదు అని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

Trending News