Asha workers protest in koti: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హమీలను ఇచ్చింది. ఈ నేపథ్యంలొ ప్రస్తుతం సర్కారు అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తుంది. ఇప్పటికి కూడా అనేక హమీలు పెండింగ్ లోనేఉన్నాయంటూ కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరొవైపు బీఆర్ఎస్ కూడా అమలుకు సాధ్యం కానీ.. 420 హమీలు ఇచ్చి రేవంత్ ప్రజల్ని మోసం చేశాడని ఏకీపారేస్తున్నారు.
అయితే.. సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్ని కల సమయంలో ఆశావర్కర్లకు.. రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇస్తామంటూ హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమకు ఇచ్చిన హమీను నెరవేర్చాలని కూడా.. ఆశావర్కర్ లు పెద్ద ఎత్తున తమనిరసనలకు దిగారు. ఇది కాస్త ప్రస్తుతం రణ రంగంగా మారింది.ఆశా వర్కర్ ల నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తొంది.
ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు
ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వాదం
ఏసీపీ శంకర్‌ను చుట్టుముట్టిన ఆశా… pic.twitter.com/BPsekWVcj2
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2024
దీంతో ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని ఆశావర్కర్ లను డీసీఎంలలో ఎక్కించినట్లు తెలుస్తొంది. అయితే.. అక్కడ కొంత మంది లేడీ పోలీసులు కూడా, పురుష పోలీసులు సైతం మహిళల్నిన డీసీఎంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. దీంతో పెద్ద ఎత్తున మహిళలు. .. డీఎంవీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. అక్కడి ఏసీపీ శంకర్ ను చుట్టుముట్టి మహిళలు నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో కొంత మంది కోటీలో..పోలీసులు.. ఓవరాక్షన్ చేసిట్లు తెలుస్తొంది. దీంతో ఒక మహిళ.. సీఐచెంప మీద కొట్టింది. దీంతో మరో ఏసీపీ మహిళలను పైటపట్టుకుని లాగి.. ఆమె ముఖంను ఫోటోతీసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది.
Read more: KTR Arrested: కేటీఆర్ అరెస్ట్.. హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తం..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పోలీసు అయి ఉండి.. మహిళపైట లాగడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఫైర్ అవుతున్నారు.ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.