Munugode: మునుగోడులో స్పీడ్ పెంచిన బీజేపీ..ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఏర్పాటు..!

Munugode: తెలంగాణలో బీజేపీ జోరు పెంచింది. మునుగోడులో ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతోంది. ఈనేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Alla Swamy | Last Updated : Sep 22, 2022, 04:32 PM IST
  • తెలంగాణలో బీజేపీ జోరు
  • మునుగోడులో గెలుపే లక్ష్యంగా పావులు
  • తాజాగా కీలక నిర్ణయం
Munugode: మునుగోడులో స్పీడ్ పెంచిన బీజేపీ..ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఏర్పాటు..!

Munugode: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈనేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీని వెల్లడించింది. కమిటీకి ఛైర్మన్‌గా వివేక్‌ను నియమించారు. కమిటీలో మొత్తం 16 మందికి చోటు కల్పించారు. కోఆర్డినేటర్‌గా గంగిడి మనోహర్ రెడ్డి ఎంపిక అయ్యారు. 

సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి ఉన్నారు. వీరితోపాటు రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, చంద్రశేఖర్, ఎండల లక్ష్మీ నారాయణను ఎంపిక చేశారు. ఇటు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌ కుమార్, తల్లోజు ఆచారి, దాసోజు శ్రవణ్‌ కూడా ఉన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలవాలన్న కసితో బీజేపీ పనిచేస్తోంది.

ఈనేపథ్యంలో పాదయాత్ర, బహిరంగ సభల ద్వారా ప్రజలకు దగ్గరవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ..నేతలు, కార్యకర్తలకు కొత్త జోష్‌ ఇస్తున్నారు. ఇటీవల మరోమారు అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఇందులో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

దీనికి పోటీగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని చేపట్టింది. ఇదంతా తమ వల్ల జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేలా చేశామంటున్నారు. గత 8 ఏళ్లల్లో ఈ విషయాన్ని ఏనాడు సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని కమలనాథులు మండిపడుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. త్వరలో మలి దఫా పాదయాత్ర ముగియనుంది.

ముగింపు సభకు బీజేపీ అధిష్టాన పెద్దలు పాల్గొనే అవకాశం ఉంది. గ్రేటర్ సమస్యలే టార్గెట్ ప్రజా సంగ్రామ యాత్ర సాగుతోంది. మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన పాదయాత్ర పెద్ద అంబర్ పేట్ ఓఆర్‌ఆర్ దగ్గర ముగియనుంది. మొత్తం పది రోజులపాటు ప్రజాసంగ్రామ యాత్ర సాగనుంది. మొత్తంగా తెలంగాణలో తిష్ట వేయాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అవి ఏ మేరకు ఫలితాయో చూడాలి..

Also read:Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు తప్పినట్లేనా?..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్‌ ఇదే..!

Also read:Rahul Gandhi: కాంగ్రెస్ సభ్యుడిగానే భారత్ జోడో యాత్ర..రాహుల్ గాంధీ సంచలన ప్రకటన..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News