Telangana CMO staff: హైదరాబాద్: తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని తీవ్ర కలవరానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుబంధంగా మెట్రో రైల్ భవన్‌లో ( Metro rail bhavan) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు. ఇటీవలే ఆ ఉద్యోగి కుమారుడు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి కూడా కరోనా వైరస్ సోకిందని అధికారులు నిర్ధాపించుకున్నారు. (Read also : Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
చీఫ్ మినిష్టర్ ఆఫీసులోనే కరోనా పాజిటివ్ కేసు ( COVID-19 case in CMO) బయటపడటంతో.. తదుపరి ఆదేశాలు అందేవరకు ఎవ్వరూ సీఎంవోకు రాకూడదని అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ నిమిత్తం ముఖ్యమంత్రి కార్యాలయంలో శానిటైజేషన్ చేసిన తర్వాతే తిరిగి తెరుచుకోనున్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు తాత్కాలికంగా సీఎంవో కార్యాలయం మూతపడనుంది. ( Read also : Health tips: సమ్మర్‌లో ఎండ వేడి నుంచి ఈ పానియాలతో త్వరిత ఉపశమనం )
ఇదిలావుంటే, అటు సీఎంవోలో ఇటు మెట్రో భవన్‌లో సదరు అధికారితో నేరుగా కాంటాక్టులోకి వచ్చిన సిబ్బందికి సైతం అధికారులు కోవిడ్-19 టెస్టులు చేయిస్తున్నారు. ఇప్పటివరకు చెస్ట్ ఆస్పత్రి వైద్య సిబ్బంది మొత్తం 30 మంది సిబ్బంది శాంపిళ్లను సేకరించారు. సీఎంఓలో పని చేస్తున్న వారిలో సీనియర్ సిటిజన్సే అధికంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Telangana CMO: తెలంగాణ సీఎం ఆఫీసులోనే కరోనా కేసు