TS Exams Dates: తెలంగాణ ఎంసెట్ పేరు మారింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా మరో ఆరు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మరోవైపు తెలంగాణ ఎంసెట్ పేరు కాస్తా టీఎస్ ఈఏపీసెట్‌గా మారింది. పరీక్షల తేదీ, నిర్వహించే యూనివర్శిటీ వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ, లా, ఐసెట్, ఎడ్‌సెట్ అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. అన్నింటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ వెలువడింది.
ఏ పరీక్ష ఎప్పుడు
మే 9 నుంచి 11 వరకూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు
మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష
మే 6న టీఎస్ ఈసెట్ పరీక్ష
జూన్ 4వ తేదీన ఐసెట్ ప్రవేశ పరీక్ష
జూన్ 6 నుంచి 8 వరకూ టీఎస్ పీజీ ఈసెట్ పరీక్షలు
మే 23న టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష
జూన్ 10 నుంచి 13 వరకూ టీఎస్ పీఈసెట్ పరీక్ష
పరీక్షల నిర్వహణ యూనివర్శిటీ వివరాలు
తెలంగాణ ఈసెట్ - ఉస్మానియా యూనివర్శిటీ
టీఎస్ ఈఏపీసెట్ - జేఎన్టీయూహెచ్
టీఎస్ ఎడ్‌సెట్ - మహాత్మాగాంధీ యూనివర్శిటీ
టీఎస్ లాసెట్ - ఉస్మానియా యూనివర్శిటీ
టీఎస్ ఐసెట్ - కాకతీయ యూనివర్శిటీ
టీఎస్ పీజీఈసెట్ - జేఎన్టీయూహెచ్
టీఎస్ పీఈసెట్ - శాతవాహన యూనివర్శిటీ
Also read: Ap Rajyasabha Elections: ఆ 9 మందిపై వేటు పడితే మూడు రాజ్యసభ స్థానాలు ఎవరికి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook