Girl Kidnap Her Lover Over Marraige Dispute: నార్మల్ గా అబ్బాయిలు,అమ్మాయిలు తొలుత ఫ్రెండ్లీగా ఉంటారు. ఈక్రమంలో కొన్నిరోజులుపోయాక.. ఇద్దరు మనస్సులు , ఆలోచనలు, ప్లాన్స్ లు ఒకటైన ప్రేమించుకుని పెళ్లి చేసుకొవాలని అనుకుంటారు. కొందరు అవతలివారికి లవ్ ప్రోపోజ్ చేస్తే కొందరు ఓకే చెప్పచ్చు.. మరికొందరు రిజక్ట్ కూడా చేయోచ్చు. దీంతో కొందరు లవర్స్ ఉన్మాదులుగా మారి తమను కాదన్న వారిపైన దాడికి తెగబడతారు. చంపడానికి కూడా వెనుకాడరు.
Read More: Manchu Lakshmi: రోజురోజుకు అందాల హద్దులు చెరిపేస్తున్న మంచు లక్ష్మి, లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్
ఇప్పటి దాక.. అబ్బాయిలు తమ ప్రేమను అంగీకరించకుంటే అమ్మాయిలపై దాడులు చేసిన ఘటనలు చూశాం. మరికొందరు యాసిడ్ దాడులు, కత్తులతో చంపడం, అమ్మాయిల ఫోటోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వంటివి చూశాం. తాజాగా, అమ్మాయిలు కూడా తామేం తక్కువ తిన్నామా.. అన్నట్లు యువకులను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ఒకవేళ కాదంటే.. టార్చర్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన మరో ఉదంతం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లో అమ్మాయిలు, అబ్బాయిలను ప్రేమ, పెళ్లి పేరుతో టార్చర్ చేస్తున్న ఘటనలు తీవ్ర దుమారంగా మారాయి. నిన్ననే ఒక యువతి.. గ్రూప్ 1 కోసం వచ్చి, సివిల్స్ ఫ్యాకల్టీని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అతను కాదనడంతో అతని ఫ్యామిలీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాజాగా, హైదరాబాద్ కు చెందిన ఒక టీవీ ఛానెల్ లో ప్రణవ్ యాంకర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని ఆశ అనే యువతి ప్రేమించింది. పెళ్లి చేసుకొవాలని ఒత్తిడి చేసింది. దీనికి అతను అంగీకరంచకపోవడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ వేసింది. ఫిబ్రవరి 10 న ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ ను కిడ్నాప్ చేసి గదిలో బంధించారు.
ఆ తర్వాత వారి బారినుంచి తప్పించుకున్న సదరు యాంకర్ ప్రణవ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈబండారం బైటపడింది. కాగా, నిందితురాలు.. డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మ్యాట్రిమోనీ సైట్ లో ప్రణవ్ ఫోటోతో మరో యువకుడు ఆశతో చాటింగ్ చేసినట్లు విషయం బైటపడింది. దీంతో పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
Read More: Samantha Fitness Secret: నాలుగు పదుల వయసులో కూడా సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
హైదరాబాద్ లో అమ్మాయిల అతితెలివికి చెందిన వరుస ఘటనలు వెలుగులోకి రావడంతో యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిది భాగ్యనగరంలో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook