Telangana Job Notifications: తెలంగాణలో కొలువుల జాతర నడుస్తోంది. తాజాగా మున్సిపల్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు శాఖల్లో కలిపి 1433 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో చీఫ్ ఇంజనీర్ (రూరల్ వాటర్ సప్లై) పోస్టులు 420, చీఫ్ ఇంజనీర్ (జనరల్ అండ్ పంచాయతీ) 350, పంచాయతీరాజ్ హెచ్ఓడీ 3, టీఎస్ఐపీఏఆర్డీ 2, ఎలక్షన్ కమిషన్ 3, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడీ 196, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో 236 పోస్టులు ఉన్నాయి. త్వరలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తాజా పోస్టులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లయింది.
ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 కింద 503 పోస్టులు, పోలీస్ శాఖ, రవాణా శాఖ, అటవీ శాఖ, ఎక్సైజ్, బ్రేవరెజెస్ కార్పోరేషన్లలో 33,787 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగ నియమాకాలకు నోటిఫికేషన్లు వస్తుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లో కోచింగ్ సెంటర్లు నిరుద్యోగ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి.
కాగా, రాష్ట్రంలో ఉద్యోగ నియమాకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 11,103 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనుండగా.. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న మిగతా పోస్టులకు విడతలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. తాజా ఉత్తర్వులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 35,220 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినివ్వగా.. మిగతా నియమాకాల కోసం కసరత్తు జరుగుతోంది.
Also Read: Pakistan Arms To Adilabad: ఆదిలాబాద్ కు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు! ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook