High court comments on marital life: నేటి యువత పెళ్లి బంధాన్ని పూర్తిగా అభాసుపాలు చేస్తున్నారు. ఏవేవో చిన్న చిన్న కారణాలు, మనస్పర్థలతో నూరేళ్ల బంధానికి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెడుతున్నారు. సాధారణంగా ఇద్దరు పెరిగిన వాతావరణం, వారి అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు దీని వల్ల బేధాభి ప్రాయాలు ఏర్పడటం కామన్. ఇద్దరు అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కానీ కొందరు మాత్రం ప్రతి చిన్న విషయాలను భూతద్దంలో పెట్టిచూస్తుంటారు. చిన్న చిన్న విషయాలను సైతం పెద్దదిగా చేసి, రచ్చచేసుకుంటారు. నాలుగు గోడల మధ్యన ఉండాల్సిన విషయాన్ని కాస్త.. పబ్లిక్ లోకి తెచ్చుకుంటారు. గొడవలు పడుతుంటారు. దీని వల్ల తమ పరువుతో పాటు, ఇంట్లో వాళ్ల పరువును కూడా బజారున పడేసుకుంటారు.
ఇలాంటి పనుల వల్ల సమాజంలో తమ కంటూ గౌరవం లేకుండా పోతుంది. దీని వల్ల అనేక సమస్యలు వచ్చిపడతారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు తమతో బేధాభి ప్రాయాలు వచ్చాక విడిపోయిన తమ పార్ట్ నర్ పట్ల సోషల్ మీడియాలో, ఫెస్ బుక్, ఇన్ స్టా లలో భాగస్వామి పరువు తీయడమే పనిగా పెట్టుకుంటారు. అప్పటివరకు కలిసి ఉన్న వారు కాస్త..తమ మధ్య జరిగిన సీక్రెట్ విషయాలను సైతం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. తమ భాగ స్వామి పరువు తీశామని పైశాచిక ఆనందం పొందామని భావిస్తుంటారు. కానీ ఇది మాత్రం క్రూరత్వం కిందకు వస్తుందని తాజాగా, తెలంగాణ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి బంధంతో ఒక్కటై, కొన్నిరోజుల పాటు జర్నీచేసి, బేధాభిప్రాయాలు రావడం వల్ల విడిపోతుంటారు. కొందరు రీవెంజ్ తీర్చుకొవాలని.. జీవిత భాగస్వామిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం చేస్తుంటారు. ఇది ఖచ్చితంగా క్రూరత్వం కిందకు వస్తుందని ధర్మాసం వ్యాఖ్యానించింది. చట్టంలోని సెక్షన్ 13(1)(i-a) ప్రకారం ఒక పక్షం మరొక పక్షం చేసే ప్రవర్తన క్రూరత్వం యొక్క పరిమితిని తెలియజేస్తుంది.
క్రూరత్వం అనే భావన వెనుక చాలా పరిణామాలు ఉంటాయి. విద్యా స్థాయి, సున్నితత్వం, ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, మత విశ్వాసాలు, సాంస్కృతిక నేపథ్యాలు మొదలైనవి వస్తాయి. కావాలని తమ డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ చర్యల ద్వారా భాగస్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించడం క్రూరత్వం పరిధిలోనికి వస్తుందని ధర్మాసం అభిప్రాయపడింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు అనేవి బలవంతం మీద నిలబడలేవని, ఎవరికి వారు ఇష్టపడి మాత్రమే వివాహా బంధాన్ని ముందుకు తీసుకెళ్లగలరని కోర్టు అభిప్రాయపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి