Telangana high court: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కేటీఆర్‌‌కి ఊరట

Minister KTR | హైదరాబాద్: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి తెలంగాణ హై కోర్టు ( TS High court) నుంచి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన నోటీసులపై (NGT notices) హై కోర్టు స్టే ఇచ్చింది. ఎన్జీటీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా అసలు ఆ ఫామ్ హౌజ్ తనది కానే కాదని హై కోర్టు దృష్టికి తీసుకొస్తూ మంత్రి కేటీఆర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కేటీఆర్ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Jun 10, 2020, 07:17 PM IST
Telangana high court: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కేటీఆర్‌‌కి ఊరట

Minister KTR | హైదరాబాద్: ఫామ్ హౌజ్ వివాదంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి తెలంగాణ హై కోర్టు ( TS High court) నుంచి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన నోటీసులపై (NGT notices) హై కోర్టు స్టే ఇచ్చింది. ఎన్జీటీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా అసలు ఆ ఫామ్ హౌజ్ తనది కానే కాదని హై కోర్టు దృష్టికి తీసుకొస్తూ మంత్రి కేటీఆర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కేటీఆర్ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. Amitabh Bachchan: రియల్ హీరో అమితాబ్ బచ్చన్.. వలసకూలీల కోసం 6 ఛార్టర్డ్ ఫ్లైట్స్ )

ఫామ్ హౌజ్ వివాదం విషయానికొస్తే.. హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో జీఓ నెంబర్ 111కు విరుద్ధంగా ఫామ్ హౌజ్ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి పిటిషన్‌ని విచారించిన ఎన్జీటీ.. ఫామ్ నిర్మాణం విషయమై తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కి నోటీసులు జారీచేసింది. Gandhi hospital: గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మనోజ్ మృతి : మనోజ్ సోదరుడు సాయినాథ్ )

అయితే, ఈ వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఇది తనపై రాజకీయ దురుద్దేశంతో చేసిన కుట్రే కానీ... అంతకుమించి మరొకటి కాదని అన్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని అప్పుడే ప్రకటించారు. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. ఎన్జీటీ జారీ చేసిన నోటీసులపై కోర్టు స్టే విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News