Ips venkateswarlu salute to his trainee ias daughter uma bharti: మనలో చాలా మంది సివిల్స్ లో ర్యాంక్ సాధించాలని పగలనక, రాత్రనక ఎంతో కష్టపడుతుంటారు. దీని కోసం రకరకాల కోచింగ్ లు తీసుకుంటారు. కొందరు కోచింగ్ సెంటర్ ల మీద ఆధారపడితే, మరికొందరు సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతుంటారు. కానీ సివిల్స్ జర్నీ అనేది లాంగ్ జర్నీ. ఎంతో ఓపికతో, కఠోర శ్రమతో మాత్రమే అభ్యర్థులు దీన్ని సాధించగలుగుతారు. ఇదిలా ఉండగా.. చాలా మంది మొదట్లో సివిల్స్ సాధిస్తామని తమ జర్నీ స్టార్ట్ చేస్తారు. కానీ మధ్యలోనే వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం చివరి వరకు పోరాడి, తమకు కావాల్సిన ర్యాంక్ సాధించి సివిల్స్ లో సత్తా చాటుతారు. అందరికి ఆదర్శంగా నిలుస్తారు.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
అయితే.. ఫాదర్స్ డేకు 2024 తెలంగాణ పోలీసు అకాడమిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈరోజు తెలంగాణ పోలీసు అకాడమికి.. శనివారం ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు ప్రాక్టికల్ ట్రెయినింగ్ కోసం రాజ్‌బహదూర్ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (RBVRR TGPA) కు వచ్చారు. ఈ నేపథ్యంలో.. వీరికి డిప్యూటీ డైరెక్టర్ వేంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ మరో డిప్యూటీ డైరెక్టర్ సీ నర్మద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేకంగా ప్రజంటేషన్ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఒక అకాడమిలో అరుదైన ఘటన జరిగింది.
ఐఏఎస్ అధికారిణిగా పోలీస్ అకాడమీకి వచ్చిన కుమార్తెకు ఆ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేశాడు. దీంతో ఇది ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురిచేశారు. తన కూతురుకు సెల్యూట్ చేస్తు ఆ తండ్రి ఆనందంతో ఉప్పోంగిపోయాడు. హైదరాబాద్ చిల్కూరు ఏరియాలోగల ‘రాజ్‌బహదూర్ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (RBVRR TGPA)’ లో శనివారం మధ్యాహ్నం ఈ అత్యంత అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో.. అధికారులు ప్రొబేషనరీ అధికారులతో స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ట్రైనీ ఐఏఎస్ అధికారులు తమ ట్రెయినింగ్ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత ట్రెయినీ ఐఏఎస్‌లు పోలీస్ అకాడమీ క్యాంపస్ అంతటా తిరిగి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీలోని అధికారులు.. పోలీస్ ట్రెయినింగ్‌కు సంబంధించిన పలు అంశాలను వివరించారు.
అయితే పోలీస్ అకాడమీకి ప్రాక్టికల్ ట్రెయినింగ్ కోసం ఏడుగురు 2023 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు వచ్చారు. వీరిలో ఉమా భారతి కూడా ఒకరు. వీరందరికి.. అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ వేంకటేశ్వర్లు సెల్యూట్ తో స్వాగతం పలికారు. కానీ కూతురుకు, కన్న తండ్రి సెల్యూట్ చేసి ఆనందంతో ఉప్పొంగిపోవడం మాత్రం ఇప్పుడు వార్తలలో నిలిచింది. అది కూడా ఫాదర్స్ డేకు ఒక రోజు ముందు జరగటంతో ఇది విపరీతంగా ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం ఉమాభారతి వికారాబాద్ జిల్లాలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter