KTR ON JAGAN: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గతంలో మంచి బంధం ఉండేది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఓపెన్ గానే ప్రకటనలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా ఏపీ అసెంబ్లీలోనే కేసీఆర్ కు ఆయన సెల్యూట్ చేశారు. ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పలుసార్లు జగన్ కు తమకు అత్యంత ఆప్తుడని చెప్పారు. అయితే కొంత కాలంగా జగన్, కేసీఆర్ మధ్య విభేదాలు వచ్చాయనే సిగ్నల్ వచ్చింది. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోనున్నా.. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య డైలాగ్ వార్ సాగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ పలు సభలో ఏపీ పాలనపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీలో కరెంట్ కోతలు ఉన్నాయి.. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఏపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిచ్చారు. వాళ్లకు మళ్లీ గులాబీ నేతలు నుంచి అదే స్థాయిలో రియాక్షన్స్ వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
తాజాగా ఏపీలో జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి కేటీఆర్. జగన్ పాలన బాగుందంటూ కితాబిచ్చారు. హిందూ పత్రిక ఎడిటర్ల బృందంతో మాట్లాడిన కేటీఆర్.. బ్రదర్ జగన్ సమర్ధ పాలకుడని కొనియాడారు. ఏపీలో పాలన అందిస్తున్నారని చెప్పారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ జగన్ విధానాలు బాగున్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులపై మహమ్మారి వచ్చినా చక్కగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు మంత్రి కేటీఆర్. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను కూడా జగన్ అమలు చేశారని కేటీఆర్ కొనియాడారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఏపీకి ఆర్ఖిక కష్టాలు వచ్చాయన్న వాదనను కేటీఆర్ కొట్టిపారేశారు. అవన్ని రాజకీయంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలే తప్ప నిజం లేదన్నారు. నిజానికి ఏపీ ఖజనా.. యూపీ ఖజానా కంటే పటిష్టంగా ఉందని కేటీఆర్ వివరించారు.
ఏపీ సీఎం జగన్ పాలన సూపరంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. జాతీయ మీడియాలో ఏపీ సీఎం జగన్ ను కొనియాడటం... ఏపీని యూపీతో పోల్చుతూ బెగటని మాట్లాడటం వెనుక రాజకీయం ఉందనే వాదన వస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో దేశమంతా పర్యటిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సాగినా.. కొత్త పార్టీ కాకుండా కూటమి దిశగానే కేసీఆర్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ను ప్రశంసిస్తూ కేటీఆర్ కామెంట్లు చేయడంతో.. బహుశా జాతీయ కూటమితో తమకు మద్దతు ఇస్తారనే ఆశతోనే అలా మాట్లాడి ఉంటారనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో వస్తోంది.
ప్రస్తుతం సీఎం జగన్.. కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. తనపై ఉన్న కేసులకు భయపడే బీజేపీకి జగన్ సరెండర్ అయ్యారని ఏపీలోని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి.. బీజేపీని కాదని కేసీఆర్ కూటమి వైపు వచ్చే ఛాన్స్ ఉండదనే చర్చ సాగుతోంది. మరోవైపు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చని... భవిష్యత్ లో బీజేపీని కాదని కేసీఆర్ కు జగన్ మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పేవాళ్లు ఉన్నారు. మొత్తంగా ఏపీలో జగన్ పాలన సూపరంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
Also read: ఎన్టీఆర్ ఫోన్ వస్తే వణికిపోతున్న కొరటాల.. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధం?
Also read: Dussehra Holidays: ఈనెల 26 నుంచే దసరా సెలవులు.. టీచర్లు పండగ చేసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook