Harish Rao: కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయకు మంత్రి హరీష్‌రావు లేఖాస్త్రం సంధించారు. ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు యునాని, చేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతోపాటు ఇగ్నో వారు అర్హులుగా ఉన్నారు.
వీరితోపాటు మెడికల్ వర్సిటీ నుంచి ప్రత్యేక కోర్సు చేసిన ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే ఎంఎల్ హెచ్‌పీ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈనిర్ణయం మిగతా అభ్యర్థులకు నష్టం కల్గిస్తుందని లేఖలో మంత్రి హరీష్ రావు తెలిపారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ప్రకారం బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సులు మెడిసిన్ గ్రాడ్యుయేట్ కోర్సులేనని స్పష్టం చేశారు.
వాటి కాల వ్యవధి, అర్హత కూడా సమానమేనని తేల్చి చెప్పారు మంత్రి హరీష్‌రావు. కేంద్రం అయుర్వేద అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించి..సమాన అర్హత ఉన్న ఇతర కోర్సుల అభ్యర్థులను విస్మరించడం సరికాదన్నారు. కాబట్టి నిబంధనలను సవరించాలని..బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీహెచ్‌ఎంస్ పూర్తి చేసిన అభ్యర్థులకు సైతం ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు యునాని, చేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
తాజాగా దీనిపై కేంద్రానికి మంత్రి హరీష్‌రావు లేఖాస్త్రం సంధించారు. గతకొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతోంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీల తలపడుతున్నాయి. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు విడివిడిగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాయి.
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా టీఆర్ఎస్ నిర్వహిస్తే..విమోచన దినోత్సవం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహించింది. తాజాగా మునుగోడు విషయంలోనూ పోరు కొనసాగుతోంది. ఆ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఇరుపార్టీలు బలంగా పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.
Also read:XI Jinping: జిన్‌పింగ్ గృహ నిర్బంధమంతా ఫేక్..ఆయన ఎక్కడ కనిపించారంటే..!
Also read:Child Marriages: ఆధునిక యుగంలో కన్యాశుల్కం ఘటన..కలకలం రేపుతున్న రియల్ సీన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Harish Rao: ఆ పోస్టుల భర్తీలో వివక్ష ఎందుకు..కేంద్రానికి మంత్రి హరీష్‌రావు లేఖ..!
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
కేంద్రానికి హరీష్‌రావు లేఖ
పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వద్దన్న మంత్రి