Telangana: కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు.

Last Updated : Dec 30, 2020, 02:10 PM IST
  • తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు
  • పిచ్చి పిచ్చి నిర్ణయాలు మానుకోకపోతే గద్దె దించుతామని హెచ్చరిక
  • త్వరలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సకల జనులతో ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించిన కోమటిరెడ్డి
Telangana: కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) పై కాంగ్రెస్ పార్టీ మాటల యుద్ధం ప్రారంభించింది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Congress mp komatireddy venkata reddy )  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( Cm Kcr ) పై తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని..గద్దె దించుతామని స్పష్టం చేశారు. ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదన్నారు. పిచ్చి తుగ్లక్ పాలనను మానుకోవాలని హితవు పలికారు. 

ఎల్ఆర్ఎస్‌ ( LRS ) పై ప్రజల పక్షాన కోర్టులో పిల్ దాఖలు చేశామని..ఎల్ఆర్ఎస్ రద్దు కోసం న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల్నించి డబ్బు వసూలు చేయడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్‌ను శాశ్వతంగా రద్దు చేయకపోతే ప్రజలే కేసీఆర్ ( KCR ) ను రద్దు చేస్తారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరుతో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ నియంత పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామన్నారు. 

Also read: Telangana ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు.. వేతనాల పెంపు, మరెన్నో నిర్ణయాలు

Trending News