Telangana Politics: నివురుగప్పిన నిప్పులా తెలంగాణ రాజకీయాలు.. ముదురుతున్న పార్టీ మారిన MLAల వ్యవహారం..

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 21, 2024, 10:14 AM IST
Telangana Politics: నివురుగప్పిన నిప్పులా తెలంగాణ రాజకీయాలు.. ముదురుతున్న పార్టీ మారిన MLAల వ్యవహారం..

Telangana Politics: పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం నెల రోజుల్లో తేల్చాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో  ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో ఈ వ్యవహారంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్పీకర్ అసలు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది. ఒక వైపు హైకోర్టు ఆదేశించిన సమయంలోనే మరో పక్క స్పీకర్ ప్రసాద్ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ సైతం జరుగుతోంది.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని  నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అసలు పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ వస్తుంది. గత ప్రభుత్వాలన్ని అదే పని చేశాయి. స్పీకర్ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది.  రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని మండిపడింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీకీ పీఏసీ ఛైర్మన్ గా స్పీకర్ ప్రకటించడం ఇంతలా వివాదానికి దారితీసింది. ఐతే స్పీకర్ ఈ నిర్ణయం ఆషామాషీగా తీసుకోలేదని.. దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

ఇక పీఏసీ అంశంపై మాట్లాడిన సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం జరిగిందని శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రతిపక్ష నేతలకు పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం ఆనవాయితీ అదే సాంప్రదాయాన్ని తమ ప్రభుత్వం పాటించదని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. శ్రీధర్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ కలకలం సృష్టించాయి.  అంటే అరికపూడి గాంధీ ఏ పార్టీ అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నాడా.. లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అరికపూడి గాంధీ ప్రకటించుకున్నారు. అందుకే పీఏసీ ఛైర్మన్ గా  స్పీకర్ ప్రకటించారని శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ కు ఒకింత షాక్ కు గురైంది. స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడింది.ప్రతిపక్ష పార్టీ ఎవరిని సూచిస్తే.. స్వీకర్ ఆ పదవి వాళ్లకు ఇవ్వడం ఆనవాయితీ. ఇలా స్పీకర్ ఎలా పడితే.. అలా ఈ పదవిపై నిర్ణయం తీసుకోవడంపైనే దుమారం రేగుతుంది.

అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికపూడి గాంధీ ఒకరు. పీఏసీ ఛైర్మన్ గా ఎన్నికైన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి మిగితా 9 మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్లా.. లేక కాంగ్రెస్ వాళ్లా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా.. అనే సందేహం అందరిలో మెదులుతుంది. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్తా రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజక అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డి, మంత్రులను కలిశారు తప్పా వారు కాంగ్రెస్ లో చేరలేదనే కొత్త వాదన కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. అంతేకాదు వారు పార్టీ కండువాలు కూడా అధికార పార్టీ కప్పలేదు.  ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధిష్టానం తీరు నచ్చక పార్టీకీ దూరంగా ఉంటున్నారనే కొత్త వాదనను మొదలుపెట్టింది. ఈ పరిణామం ఒకింత బీఆర్ఎస్ కు షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు. అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు. అందులో భాగంగానే అరికపూడి గాంధీనీ పీఏసీ ఛైర్మన్ గా నియమించడం. ఆయనతో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పించడం అందులో భాగమేనని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముందుముందు పెద్ద సవాల్‌ ఎదురయ్యేలా కనిపిస్తోంది. పది మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. దానం నాగేందర్ ఇష్యూలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. మిగితా తొమ్మది మంది ఎమ్మెల్యేలను పక్కన పెడితే దానం నాగేందర్ అంశంలో ఒక చిక్కు ముడి ఏర్పడింది.  ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ తరుపున దానం నాగేందర్ పికింద్రాబాద్ బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే దానం నాగేందర్ కు పెద్ద సమస్యగా వచ్చి పడింది. దీంతో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడింది. అయితే దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఓ క్లారిటీతోనే ఉందట.

ఒక వేళ స్పీకర్ దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తే  ఏం చేయాలో ఇప్పటికే ఒక ప్రణాళికతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సిద్దపడేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది.  ఎలాగో అధికారంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పై కూడా ప్రజలకు ఒకింత సానుకూల వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చినా గెలుపు కాంగ్రెస్ దే అన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారట. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్ ఆలోచనగా ఉందట.  ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్ లో తన పట్టు నిలుపుకోవాలని చూస్తోందట. అయితే ఇంత వరకు బాగానే ఉన్న ఇక్కడ కూడా కాంగ్రెస్ కు ఒక నెగిటివ్ అంశ కలవరపెడుతుందట. గతంలో ఆసిఫ్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేసి  దానం నాగేందర్ టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అప్పటి సీఎం వైయస్ఆర్ ప్రోద్బలంతో  రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అయితే ఏంటనేది  ఆ పార్టీ నేతలను టెన్షన్‌ పెడుతోందట.

మొత్తానికి కాంగ్రెస్ రచిస్తున్న వ్యూహాలతో బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీఏసీ ఛైర్మన్. ఎమ్మెల్యేల అనర్హతం అంశం, వాటిపై బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను ఎలా ఎదుర్కోనుందో అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News