బీజేపీ ప్రచారానికి మోడీ ఫినిషింగ్ టచ్ ; నేడు హైదరాబాద్ బహిరంగ సభలో ప్రసంగం

తెలంగాణ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించేందకు జాతీయ నేతలు క్యూకడుతున్నారు. 

Last Updated : Dec 3, 2018, 10:24 AM IST
బీజేపీ ప్రచారానికి మోడీ ఫినిషింగ్ టచ్ ; నేడు హైదరాబాద్  బహిరంగ సభలో ప్రసంగం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం ఇప్పటికే పలుమార్లు పార్టీ అగ్రనేతలను ప్రచారంలోకి దించింది. ఇప్పుడు ప్రచారానికి పినిషింగ్ టచ్ ఇచ్చేందుకు ప్రధాని మోడీని మరోమారు రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలుమార్లు ప్రచారం నిర్వహించనగా...ప్రధాని మోడీ ఓ సారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.మలివిడత ప్రచారంలో భాగంగా  ప్రధాని మోడీ మరోమారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహింగర సభలో ప్రసంగిస్తారు. మోడీ ప్రసంగించే సభా వేదికపై 40 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేదికపై గ్రేటర్ హైద్రబాద్ పరిధిలోని ఎమెల్యేలతో సహా పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. కాగా సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది

బీజేపీ పర్యటనపై బోలెడు ఆశలు

ప్రధాని పర్యటనను కమలదళం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణలో బీజేపీకి పట్టున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ నగరమే అని చెప్పుకోవాల్సి ఉంది. ఇక్కడ కమలం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రచారంపై ఎమ్మెల్యేలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. గత పర్యటనలో ప్రధాని మోడీ నిజామాబాద్, మహాబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇలా ఉత్తర, దక్షిణ తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని ఇప్పుడు జంటనగరాల ఓటర్లపై దృష్టిసారించారు. ఇదిలా ఉండగా ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతంల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Trending News