Revanth Reddy: నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు కేసీఆర్.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Telangana Vijaya Bheri Yatra in Sangareddy: నన్ను రేటెంత రెడ్డి అని కేసీఆర్ అంటున్నారని.. తనను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. కేసీఆర్ జీవిత కాలం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిందేనని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 29, 2023, 08:47 PM IST
Revanth Reddy: నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు కేసీఆర్.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Telangana Vijaya Bheri Yatra in Sangareddy: స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి మల్కాజిగిరి ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మైనంపల్లి రోహిత్‌ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం తనను తానును చూసుకున్నట్లుందని.. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్ పేద ప్రజలకు సేవ చేస్తారని పేర్కొన్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదని.. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ విజయ భేరీ యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రజల ఆకాంక్ష కోసం సోనియమ్మ తెలంగాణ ఇచ్చారో.. ఆ ఉద్దేశం నెరవేరలేదని అన్నారు.

"ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు జరగాలి. అందుకే తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కేసీఆర్ నువ్వో కచరా.. నన్ను రేటెంత రెడ్డి అంటావా..? రేవంత్ రెడ్డిని కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు.. కేసీఆర్ దుర్మార్గాలతో రాష్ట్రాన్ని బెల్టు షాపుల తెలంగాణగా మార్చారు.. తెలంగాణను జుమ్మె రాత్ బజార్ లో అమ్మేసిన నువ్వా నా గురించి మాట్లాడేది.. మేడిగడ్డపై కుట్ర జరిగిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. బాంబులు పెడితే ఎక్కడైనా పిల్లర్లు భూమిలోకి కుంగుతాయా..? ఆ మాత్రం ఆలోచన లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ నెలా మహిళలకు రూ.2500 అందిస్తాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. రైతు భరోసా ద్వారా ప్రతీ ఏటా రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు అందిస్తాం.. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు ఆర్థికసాయం అందిస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. ఇక కేసీఆర్ జీవితకాలం ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందే.." అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసురుతున్నానని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ చెప్పినట్లు కర్ణాటక రాష్ట్రానికి బస్సు సిద్ధం చేశామన్నారు. బస్సులు ప్రగతి భవన్‌కు రావాలా..? గజ్వేల్‌లోని ఫామ్‌ హౌస్‌కు రావాలా..? అని అడిగారు. కేసీఆర్ తేదీ చెప్పాలని.. బీఆర్ఎస్ మంత్రి వర్గంతో కర్ణాటకకు వెళ్దామన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో.. అక్కడ ప్రజలను అడిగి తేల్చుకుందామన్నారు.

Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. నాగం జనార్థన్‌ రెడ్డి రాజీనామా  

Also Read: Virat Kohli: ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. విరాట్ కోహ్లీ డకౌట్.. వీడియో చూశారా..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News