తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులతో పాటు పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సినీ, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు కరోనా మహమ్మారిన పడ్డారు. ఈ క్రమంలో తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే (Mynampally Hanumantha Rao) కోవిడ్19 బారిన పడ్డారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కరోనా పాజిటివ్ (Mynampally Hanumantha Rao Tests Positive for CoronaVirus)గా తేలింది. ఇటీవల జరిపిన కోవిడ్-19 (COVID-19) నిర్ధారణ పరీక్షలలో ఆయనకు పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఆయన భార్య, ఓ కుమారుడు సైతం కరోనా వైరస్ బారిన పడినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు.
Also Read : Pensioners Life Certificate: ఈపీఎఫ్‌వో సరికొత్త సదుపాయం
తెలంగాణలో మంగళవారం వరకు మొత్తం 2,42,506 మంది కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స అనంతరం 2,23,413 మంది కోలుకున్నారని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. కరోనా బాధితుల రికవరీలో జాతీయ సగటు కన్నా తెలంగాణ సగటు అధికంగా ఉండటం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe