దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల అంశంపై స్పందించిన కేటీఆర్

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల అంశంపై స్పందించిన కేటీఆర్

Last Updated : Jun 19, 2019, 10:40 PM IST
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల అంశంపై స్పందించిన కేటీఆర్

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల అంశంపై టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణ అంశం ఆహ్వానించదగిన పరిణామమే అవుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గైర్హాజరవగా ఆ పార్టీ తరపున కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. 

అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బడ్జెట్ పెట్టేందుకు వీలుగానూ ఉంటుందని అన్నారు. జమిలి ఎన్నికలపై అంత తొందరేమీ లేదని ప్రధాని మోదీ అన్నారని చెప్పిన కేటీఆర్.. రాష్ట్రాలను బలోపేతం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానికి వివరించామని తెలిపారు. వెనుకబడిన జిల్లాలను ప్రకటించి వదిలేయకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందించడంతోపాటు వ్యవసాయం, విద్యను రాష్ట్రాల జాబితాలో చేర్చాలని సూచించినట్టు చెప్పారు.
 

Trending News