TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షకు కౌంట్ డౌన్ మెుదలైంది. మరి కాసేపట్లో గ్రూప్-4 పరీక్ష మెుదలుకానుంది. రాష్ట్రంలో 8 వేల180 గ్రూప్-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ఇవాళ (జూలై 01) రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షకు మెుత్తం 9.51లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దీని కోసం 2878 ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య పరీక్ష పత్రాల తరలించనున్నారు.
పరీక్షకు వెళ్లేటప్పుడు ఇవి మరిచిపోవద్దు..
ఉదయం 10 గంటల నుండి 12-30 వరకు పేపరు-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2(సెక్రటేరియల్ ఎబిలిటీస్) జరగనుంది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం 1 గంట నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూయనున్నారు. అందుకే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ కు ముందే చేరుకోవడం మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులు, నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు. ఎట్టి పరిస్థితుల్లోనూ షూ ధరించి పరీక్షా కేంద్రానికి రావొద్దు.
అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ లోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపు కార్డు చూపించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అసలు అభ్యర్థి స్థానంలో మరో వ్యక్తి హాజరైనట్లు గుర్తిస్తే పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు ఆ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈసారి వేలిముద్రను తప్పనిసరి చేశారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ/ బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌కాకుండా ఇంక్‌పెన్, జెల్‌పెన్, పెన్సిల్ ఉపయోగించినా గ్రూప్-4 ఓంఆర్ షీట్ చెల్లుబాటు కానిదిగా పరిగణిస్తారు.
Also Read: 7th Class Student Bank Robbery Attempt: 7వ తరగతి బాలుడు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు.. కానీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook