TSPSC Recruitment 2023: తెలంగాణలో నిరుద్యోగులు అంతా ఎదురు చూస్తున్నట్టుగానే వరుస ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుంది. అందుకు అనుగుణంగా ఇక ఈ మధ్యలో తెలంగాణలో మొత్తం 1363 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించింది తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ గ్రూప్ 3 ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్పిస్తోంది.
ఇక ఈ గ్రూప్ 3 ఉద్యోగాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఉండనున్నారు. ఇక ఇందులో ఏ పోస్టుకు ఏ విభాగంలో డిగ్రీ అవసరం అనేటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఇక ఈ గ్రూప్ 3 ఉద్యోగాలకు వయో పరిమితి 18-44 ఏళ్లుగా నిర్ణయించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
అయితే వెనుకబడిన వర్గాల వారిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో కొన్ని వర్గాలకు వయో పరిమితిలో మాత్రం సడలింపులు ఇచ్చారు. ఇక అందుకు ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు సైతం నోటిఫికేషన్లో మీరు గమనించవచ్చు. గ్రూప్ 3 ఎగ్జామ్ ను జులై లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉండగా ఇక అర్గులు అయిన అభ్యర్దులు tspsc.gov.in వెబ్ సైట్లో అప్ప్లై చేసుకోవచ్చు. ఇక 105 విభాగాల్లో గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్దమైంది.
Also Read: Telangana Crime: బాసరలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Also Read: Varahi Vehicle: కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో వారాహికి పవన్ పూజలు