YS Sharmila on Aarogyasri Scheme: ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారంటూ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయకుండా లక్షల మంది ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ఆర్ తెచ్చిన పథకాలు అద్భుతమని.. వాటి అమలులో పిచ్చి భేషజాలు లేవని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పిన దొర గారు.. ఇన్నాళ్లు "చెప్పిందొకటి .. చేసిందొకటి" అని అన్నారు.
పైకి కపట ప్రేమను నటిస్తూ లోపల కాలకూట విషాన్ని చిమ్మిడని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారంటూ ఫైర్ అయ్యారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేశారని అన్నారు. ఏటికేటా బిల్లులు చెల్లించక ఆరోగ్యశ్రీ పేరు చెప్తేనే ఆసుపత్రుల్లో కేసులు పట్టకుండా చేశారని పేర్కొన్నారు. కంటికి పంటికి జబ్బు చేస్తే ఢిల్లీకి, కార్పొరేట్ దవాఖానకు పరుగులు పెట్టే దొర.. పేదోడికి దక్కాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కారీ దవాఖానలకే పథకాన్ని పరిమితం చేశాడు. తొమ్మిదేండ్లుగా ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా లక్షల మంది ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్‌ది. కరోనా వంటి విపత్కర పరిస్థితిలోనూ బకాయిలు చెల్లించకుండా వేలాది మంది పేదల చావులకు ప్రత్యక్ష కారకుడు కేసీఆర్. ఇన్నాళ్లు పథకంపై సవతి తల్లి ప్రేమ చూపిన దొర గారికి ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆరోగ్యశ్రీ ఇయ్యకుంటే ఎన్నికల్లో ప్రజలు తన్ని తరుముతరని అర్థమైంది. అందుకే 2లక్షల నుంచి ప్రీమియాన్ని రూ.5 లక్షలకు పెంచిండు.." అని విమర్శించారు.
పని చేయని పథకానికి అంకెల్లో ప్రీమియం పెంచి ఏదో ఉద్దరించినట్లు ఇప్పుడు బిల్డప్పులు ఇస్తున్నారని అన్నారు. 'అయ్యా కేసీఆర్ గారు.. మీ ఎన్నికల జిమ్మిక్కులు, నక్క తెలివితేటలు ఇప్పటికైనా పక్కన పెట్టండి. ప్రజల ప్రాణాలతో నీచ రాజకీయలు ఆపండి.' అని హితవు పలికారు. తక్షణం ఆరోగ్యశ్రీని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు రూ.800 కోట్లు చెల్లించాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారమైనా 5 లక్షల ప్రీమియాన్ని ఆపకుండా అమలు చేయాలన్నారు.
Also Read: Minister Roja: పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో: మంత్రి రోజా
Also Read: MP Komatireddy Venkat Reddy: మా రేవంత్‌కి కోపం ఎక్కువ.. ఒకటి అంటే నాలుగు తిడతాడు: ఎంపీ కోమటిరెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook