Byzantine Wine Complex: 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్‌​ కాంప్లెక్స్‌..ఇజ్రాయిల్ లో వెలుగులోకి..

1500 ఏళ్ల పురాతన వైన్ కాంప్లెక్స్ ఇజ్రాయిల్ లో వెలుగు చూసింది. ఇది బైజాంటైన్ కాలం నాటిదిగా ఆ దేశ పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 03:39 PM IST
Byzantine Wine Complex: 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్‌​ కాంప్లెక్స్‌..ఇజ్రాయిల్ లో వెలుగులోకి..

Israel:  బైజాంటైన్ యుగం(Byzantine era)నాటి 1500 ఏళ్ల పురాతన పారిశ్రామిక వైన్ కాంప్లెక్స్‌(Wine Complex )ని ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు(archaeologists) కనుగొన్నారు. అప్పట్లోనే ఇది ఏటా రెండు మిలియన్ లీటర్ల  వైన్‌ని ఉత్పత్తి చేసేదని అన్నారు. అంతేకాదు ఇది ప్రపంచంలోని అతి పెద్ద కేంద్రంగా ఉండేదని చెబుతున్నారు. బైబిల్‌ కాలంలో యూదులు స్థావరంగా ఉండే టెల్ అవీవ్‌కి  దక్షిణాన ఉన్న యవ్నేలో ఈ అత్యాధునిక సదుపాయం ఉన్నట్లు  తెలిపారు.

క్రీ.శ.70లలో జెరుసలేం(Jerusalem) నాశనమైన తదనంతరం ఒక ముఖ్య నగరంలో ఐదు వైన్‌ కాంప్లెక్స్‌లు ఒక చదరపు కిలో మీటరు మేర విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు వైన్‌(Wine)ని నిల్వచేయడానికి ఉపయోగించే బంకమట్టి ఆంఫోరాలు, వైన్‌ తయారు చేయడానికి వాడే బట్టీలు, మట్టి పాత్రలు తదితర సామాగ్రి చెక్కు చెదరకుండా అత్యంత అధునాతనంగా ఉన్నాయని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల ప్రాధికార సంస్థ పేర్కొంది.

Also read: Shocking news: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు!

ఈ వైన్‌ని గాజా, అష్కెలోన్ వైన్‌ వంటి పేర్లతో పిలిచేవారని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అప్పట్లోనే ద్రాక్ష రసాన్ని పులియబెట్టే ప్రక్రియలు ఉండేవని అంటున్నారు. అదే ప్రదేశంలో పురావస్తు అధికారులు రెండు సంవత్సరాల పాటు జరిపిన తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల నాటి పర్షియన్‌ కాలపు వైన్‌లు కూడా బయటపడ్డాయని వెల్లడించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News