Amazon founder Jeff Bezos: 124 అమెరికన్ బిలియన్ డాలర్ల సంపదలో అధిక భాగం సేవకే

Amazon founder Jeff Bezos to CNN : అమెజాన్ కంపెనీలో రాబోయే రోజుల్లో 10 వేల మంది ఉద్యోగులను తొలగించే దిశగా ఆ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం అదే అమేజాన్ కంపెనీలో ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ హోదాలో ఉన్న జెఫ్ బెజోస్ మాత్రం తన సంపదలో అధిక భాగం చారిటీకే కేటాయిస్తానని ప్రకటించాడు.  

Written by - Pavan | Last Updated : Nov 15, 2022, 06:23 AM IST
Amazon founder Jeff Bezos: 124 అమెరికన్ బిలియన్ డాలర్ల సంపదలో అధిక భాగం సేవకే

Amazon founder Jeff Bezos to CNN : అమేజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన జీవితకాలంలో 124 అమెరికన్ బిలియన్ డాలర్ల సంపదలో మెజారిటీ వాటాను చారిటీ కోసమే కేటాయిస్తానని సోమవారం CNN కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చారిటీకి సంబంధించి ఎక్కుగా వివరాలను వెల్లడించని జెఫ్ బెజోస్.. తాను, తన భాగస్వామి లారెన్ సాంచెజ్ కలిసి " చారిటీ కోసం ఆ ధనాన్ని సమకూర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకునే పనిలో ఉన్నాం " అని తెలిపారు. 

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న వాతావరణ మార్పులతో పోరాడటానికి, ప్రకృతిని రక్షించడానికి బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా $10 బిలియన్లు అందించనున్నట్టు జెఫ్ బెజోస్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. బెజోస్ ఎర్త్ ఫండ్ లో జెఫ్ బెజోస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇదే విషయమై జెఫ్ బెజోస్ నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రపంచ మీడియా దిగ్గజం రాయిటర్స్ ప్రయత్నించినప్పటికీ.. బెజోస్ ఎర్త్ ఫండ్ వెంటనే స్పందించలేదు. 

"బెజోస్ కరేజ్ అండ్ సివిలిటీ అవార్డ్" ద్వారా కంట్రీ మ్యూజిక్ స్టార్, పరోపకారి డాలీ పార్టన్ $100 మిలియన్లను అందుకున్నారు. శనివారం ట్విటర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2021లో అమేజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి వైదొలిగిన జెఫ్ బెజోస్.. అమెజాన్‌లో ప్రస్తుతం 10 శాతం వాటా కలిగి ఉన్నారు. ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్, స్పేస్ టూరిజం కంపెనీ బ్లూ ఆరిజిన్‌ సంస్థలకు సైతం ఈకామర్స్ కంపెనీలో వాటాలు ఉన్నాయి. ఏదేమైనా.. అమెజాన్ కంపెనీలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించే దిశగా ఆ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం అదే అమేజాన్ కంపెనీలో ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ హోదాలో ఉన్న జెఫ్ బెజోస్ ( Jeff Bezos ) మాత్రం తనకు ఉన్న 124 అమెరికన్ బిలియన్ డాలర్ల సంపదలో అధిక భాగం చారిటీకే కేటాయిస్తానని ప్రకటించడం గమనార్హం.

Also Read : Amazon layoffs: 10 వేల మంది సిబ్బందికి షాకివ్వనున్న అమేజాన్

Also Read : Meta Fired 11000 employees: మెటాలో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన

Also Read : Twitter India: ఉద్యోగులకు కోలుకోలేని షాక్.. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News