America Ban: వ్యాక్సిన్ ముడిపదార్ధాల ఎగుమతిపై నిషేధం సబబే అంటున్న అమెరికా

America Ban: ఇండియాలో వ్యాక్సిన్ తయారీకు అవసరమైన ముడి పదార్ధాల్ని ఎగుమతి చేయడంపై విధించిన నిషేధాన్ని అమెరికా సమర్ధించుకుంది. ముందు అమెరికా..తరవాతే ఇతర దేశాలని చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2021, 02:15 PM IST
America Ban: వ్యాక్సిన్ ముడిపదార్ధాల ఎగుమతిపై నిషేధం సబబే అంటున్న అమెరికా

America Ban: ఇండియాలో వ్యాక్సిన్ తయారీకు అవసరమైన ముడి పదార్ధాల్ని ఎగుమతి చేయడంపై విధించిన నిషేధాన్ని అమెరికా సమర్ధించుకుంది. ముందు అమెరికా..తరవాతే ఇతర దేశాలని చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది..

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) తయారీకు అవసరమైన ముడి పదార్ధాల్ని (Raw Material) అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. అయితే అమెరికా తమ దేశం నుంచి ఇండియాకు జరిగే వ్యాక్సిన్ ముడి పదార్ధాల ఎగుమతులపై నిషేధం ( America Ban on Vaccine raw material export) విధించింది. ఇప్పుడు తాజాగా ఆ నిషేధాన్ని అమెరికా దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రిన్స్ సమర్దించుకున్నారు. అమెరికా దేశీయలు బాథ్యతల్ని పట్టించుకోవడమే ప్రథమ కర్తవ్యమని వివరించారు. ఎగుమతులపై నిషేధం విధించడానికి రెండు ప్రత్యేక కారణాలున్నాయన్నారు. అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్ (Vaccination) చేయడం తొలి ప్రాధాన్యత అని..ప్రపంచంలోని మరే దేశంతో పోల్చినా కోవిడ్ బారిన ఎక్కువ ప్రభావితమైన దేశం అమెరికానని చెప్పారు. అమెరికాలో 5 లక్షల 50 వేల మంది చనిపోవడమే దీనికి ఉదాహరణ అన్నారు.

వైరస్ (Covid19 virus) ఏదో ఒక ప్రాంతంలో ఉన్నంతకాలం అది సరిహద్దులు దాటుతూ ఉంటుందని..మ్యూటేట్ చెందుతూ దేశదేశాలకు వ్యాపిస్తుందని చెప్పారు. అందుకే తమ మొదటి లక్ష్యం ఎప్పుడూ అమెరికన్ల బాగోగులు చూడటమేనన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్( Joe Biden)‌తో పాటు గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్( Donald Trump) కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ముందుగా అమెరికా అవసరాలు తీర్చాలనేది చట్టమన్నారు. అందుకే ముడిపదార్ధాల ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Also read: Travel Ban: కోవిడ్19 కల్లోలం, భారత్‌పై ట్రావెన్ బ్యాన్ విధించిన మరో రెండు దేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News