అమెరికన్లకు ఆ విషయం తెలియదా..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనకు వచ్చారు.. వెళ్లారు. ఐతే ఆయన పర్యటనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. 

Last Updated : Feb 26, 2020, 09:25 AM IST
అమెరికన్లకు ఆ విషయం తెలియదా..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనకు వచ్చారు.. వెళ్లారు. ఐతే ఆయన పర్యటనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. భారత పర్యటన కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ . .  గత 15 రోజులుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. .  ట్విట్టర్‌తో సహా .. ఎక్కడ కనిపించినా .. హడావుడి చేశారు. అన్నట్టుగానే.. అనుకున్న సమయానికి వచ్చారు .. వెళ్లిపోయారు.  ఐతే ట్రంప్ భారత పర్యటన సందర్భంగా  అమెరికన్లు ఆసక్తికర అంశాలకి తెరతీశారు. ఇంతకీ విషయం ఏంటంటే..!! భారత్ ఎక్కడుంది..? భారత్ అంటే ఏంటి .. ? అంటూ అమెరికన్లు గూగుల్‌లో సెర్చ్ చేశారు. 

ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. నిజానికి భారత్‌ లో.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే 'అత్యంత అభివృద్ధి చెందిన దేశం' అమెరికా. అందుకే ఆ దేశాన్ని అగ్రరాజ్యం అని వ్యవహరిస్తారు. అంటే .. అమెరికా ..ప్రపంచ దేశాలన్నింటికీ పెద్దన్నలాంటిదన్నమాట. మరి అలాంటి దేశ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉంటారని ఓ నమ్మకం ఉంది. కానీ అక్కడి ప్రజలకు భారత్ అంటే తెలియదంటే నమ్మగలమా..? కానీ నమ్మి తీరాలి. ఎందుకంటే ట్రంప్ పర్యటన సందర్భంగా చాలా మంది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఇండియా అంటే ఎంటి..? ఇండియా ఎక్కడుంది..?  అని సెర్చ్ చేయడమే దీనికి ఉదాహరణ. అందులోనూ భారతీయులు అధికంగా నివసించే న్యూజెర్సీలో ఎక్కువ మంది ఇలా సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో న్యూ హ్యాంప్‌షైర్, అలబామా, జార్జియా, ఇల్లినాయిస్ నిలిచాయి. 

నిజానికి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని చేసేది ఎక్కువ మంది భారతీయులే. మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు భారతీయులే కావడం విశేషం. అలాంటి దేశంలో అక్కడి ప్రజలకు ఇండియా ఎక్కడుందో తెలియదంటే .. నిజంగా ఆశ్చర్యమే. గత నెల కూడా అమెరికన్లు ఇలాగే .. ఇరాన్ ఎక్కడుంది ..? అని సెర్చ్ చేశారు.

Trending News