Bill Gates: కరోనా పెను ప్రమాదమవుతుంది జాగ్రత్త

Bill Gates: కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉంది. రానున్న 4-6 నెలలు చాలా డేంజర్. వైరస్ కేసులు పెరగవచ్చు. మరణాలు సంఖ్య పెరగనుంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చరిక ఇది.

Last Updated : Dec 14, 2020, 11:01 PM IST
Bill Gates: కరోనా పెను ప్రమాదమవుతుంది జాగ్రత్త

Bill Gates: కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉంది. రానున్న 4-6 నెలలు చాలా డేంజర్. వైరస్ కేసులు పెరగవచ్చు. మరణాలు సంఖ్య పెరగనుంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చరిక ఇది. 

ప్రముఖ గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ( Microsoft ) అధినేత బిల్‌గేట్స్ ( Bill gates ) చేసిన హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. రానున్న 4-6 నెలల్లో కరోనా వైరస్ ( Corona virus ) మరిన్ని సవాళ్లు విసరవచ్చని బిల్‌గేట్స్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు వైరస్ అనారోగ్య సమస్యలు సృష్టించవచ్చని తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించడం సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే మరణాల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.  

కోవిడ్ 19 ( Covid 19 ) కట్టడి కోసం వ్యాక్సిన్ ( vaccine ) అభివృద్ధి..పంపిణీ నిమిత్తం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ పరిశోధన సంస్థ ఆర్ధిక సహకారం అందిస్తుందనేది అందరికీ తెలిసిందే. యూఎస్ ( US ) ‌లో ఇప్పటివరకూ 2 లక్షల 90 వేల మంది మరణించారు. మరో 2 లక్షల వరకూ మరణించవచ్చని ఐహెచ్ఎంఈ అంచనా వేసింది. ఇది కచ్చితంగా బాధించే విషయమని  బిల్‌గేట్స్ చెప్పారు. యూఎస్‌లో పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య ఆందోళనగా ఉందన్నారు. వైరస్ కారణంగా ఎక్కువమంది చనిపోవచ్చని 2015లో అంచనా వేసినప్పటికీ..కోవిడ్ 19 వైరస్ అంతకంటే ఎక్కువ నష్టాన్ని కల్గిస్తుందని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. Also read: Eswatini Prime Minister Dies: కరోనాతో ఎస్వాతిని ప్రధాని కన్నుమూత

Trending News