చైనాలో 'కరోనా వైరస్' వ్యాక్సిన్ తయారీ

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ అతి కొద్దికాలంలోనే 200  దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. 

Last Updated : Apr 14, 2020, 09:41 AM IST
చైనాలో 'కరోనా వైరస్' వ్యాక్సిన్ తయారీ

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ అతి కొద్దికాలంలోనే 200  దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. 

మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి మందు లేదు. మరోవైపు దీన్ని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డారు. ఐతే వ్యాక్సిన్ తయారీ కోసం చైనా శాస్త్రవేత్తలు కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఫేస్ 1 పూర్తి చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీ రెండో దశలో ఉంది.  క్లినికల్ ట్రయల్స్ కోసం 500 మంది వ్యక్తులను నియమించుకున్నారని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

కరోనా వైరస్ ఇప్పటి వరకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారినే పూర్తిగా లొంగదీసుకుంది. వారిని మృత్యుకౌగిట బంధించింది. అంటే ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఎక్కువ శాతం వృద్ధులే ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వారికి పని చేయాలనే ఉద్దేశ్యంతో చైనా శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం నియమించుకున్న 500 వాలంటీర్లలో 87 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండడమే దీనికి ఉదాహరణ. 

చైనాకు చెందిన మిలిటరీ ఆకాడెమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దీనికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మేజర్ జనరల్ చెన్ వీ నేతృత్వం వహిస్తున్నారని వెల్లడించింది. వ్యాక్సిన్ తయారీ కోసం జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతులు ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. వ్యాక్సిన్‌కు సంబంధించి నిర్వహించిన ఫేస్ 1 క్లినికల్ ట్రయల్స్‌లో .. ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం అనే దానిపై చైనా శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. రెండో దశలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ పనితీరు, సామర్థ్యంపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చిలో ప్రారంభమైన ఈ క్లినికల్ ట్రయల్స్ .. ఇప్పుడే తొలిసారిగా మనుషులపై చేయడం  విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News