CoronaVirus: గాలితోనూ కరోనా వ్యాప్తి: శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ (CoronaVirus) గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా..? కరోనావైరస్ గాలిలో కలిసిపోయిందా..? అయితే ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బహిరంగంగానే ఖండిస్తుంది. కానీ 32 దేశాలకు చెందిన దాదాపు 239 మంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుంతుందని పేర్కొంటున్నారు. 

Last Updated : Jul 6, 2020, 04:23 PM IST
CoronaVirus: గాలితోనూ కరోనా వ్యాప్తి: శాస్త్రవేత్తలు

వాషింగ్టన్ : కరోనా వైరస్ (Coronavirus) గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా..? కరోనావైరస్ గాలిలో కలిసిపోయిందా..? అయితే ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బహిరంగంగానే ఖండిస్తుంది. కానీ 32 దేశాలకు చెందిన దాదాపు 239 మంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుంతుందని పేర్కొంటున్నారు. న్యూయార్క్ టైమ్స్ (New York Times- NYT) రిపోర్ట్ ప్రకారం.. శాస్త్రవేత్తలు కరోనా మార్గదర్శకాలను మార్చాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు బహిరంగ లేఖ రాశారు.  గాలిలో ఉన్న వైరస్ చిన్న చిన్న కణాలు ప్రజలను వ్యాధి బారిన పడేలా చేస్తున్నాయన్న వారి ఆధారిత నివేదికను వచ్చే వారం నాటికి సైంటిఫిక్ జర్నల్‌లో (Scientific journal) ప్రచురించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. Also read: SBI New Rules To Withdrawal: ఎస్‌బిఐ ఏటీఎం నిమయాలు మారాయి

గాలిలో వైరస్ సూక్ష్మకణాలు.. 
కరోనా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్వాస ద్వారా బయటకు వచ్చే తుంపర్లు.. ఆ వ్యక్తి గది ఎంత దూరం ఉంటుందో అంత వరకు వ్యాప్తిచెంది.. మరో వ్యక్తికి సోకుతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇంకా గాలిలో వైరస్‌కు సంబంధించిన సూక్ష్మ కణాలు ఉన్నాయని.. దీనిద్వారానే వ్యాధి వేగంగా వ్యాప్తిచెందుతోందని వారు పేర్కొంటున్నారు. Also read: 
China Troops At LAC: భారత్‌ దెబ్బకు వెన‌క్కి త‌గ్గిన చైనా, గుడారాలతో సహా!

ఎలాంటి ఆధారాలు లేవు: డబ్ల్యూహెచ్‌వో 
కరోనా సోకిన వ్యక్తికి దగ్గు లేదా తుమ్ము వచ్చిన సమయంలో బయటకు వచ్చే తుంపర్లు.. మరొక వ్యక్తికి చేరినప్పుడు మాత్రమే వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అయితే గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెంది మరో వ్యక్తికి సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక ప్రతినిధి డాక్టర్ బెనెడెట్టా అల్లెగ్రాంజి (Benedetta Allegranzi) మాట్లాడుతూ.. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి (airborne transmission) సాధ్యమని గత కొన్ని నెలల నుంచి చాలాసార్లు పేర్కొన్నాం. కానీ దీనిపై ఇంతవరకు స్పష్టమైన ఆధారాలను మాత్రం కనుగొనలేదని అభిప్రాయపడ్డారు. 
 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x