Video: క్రియేటివ్‌గా ట్రై చేశాడు.. అందర్నీ వెనక్కి నెట్టి జాబ్ కొట్టేశాడు..

Creativity in applying for Job: ఈరోజుల్లో ఏ ఉద్యోగానికి అప్లై చేసినా టఫ్ కాంపీటిషన్‌ని ఫేస్ చేయాల్సిందే. ఇదిగో ఈ యువకుడిలా అందరి కన్నా స్మార్ట్‌గా, క్రియేటివ్‌గా ఆలోచిస్తే తప్ప కంపెనీ యాజమాన్యం దృష్టిలో పడటం సాధ్యం కాదేమో...!

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 08:34 PM IST
  • క్రియేటివ్‌గా ఉద్యోగానికి అప్లై చేసిన యూకె యువకుడు
  • అందరిలా కాకుండా డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా
  • కంపెనీ ఫ్లయర్స్‌పై రెజ్యుమ్ ప్రింట్ చేసి యాజమాన్యం దృష్టిలో పడ్డాడు
Video: క్రియేటివ్‌గా ట్రై చేశాడు.. అందర్నీ వెనక్కి నెట్టి జాబ్ కొట్టేశాడు..

Creativity in applying for Job: గుంపులో ఒకరిగా కాకుండా... మిగతావాళ్లకు భిన్నంగా, క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లు త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. యూకెకి చెందిన 24 ఏళ్ల జొనాథన్ స్విఫ్ట్ ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న జొనాథన్.. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ఆ దిశగా ప్రయత్నం చేశాడు. అనుకున్నట్లు గానే ఆ కంపెనీ యాజమాన్యం దృష్టిలో పడటమే కాదు... ఉద్యోగం కూడా సంపాదించాడు.

జొనాథన్ స్విఫ్ట్ వృత్తిపరంగా ప్రింటింగ్ స్పెషలిస్ట్. కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో యూకెలోని యార్క్‌షైర్‌లో ఉన్న ప్రముఖ  ప్రింటింగ్ కంపెనీ 'ఇన్‌స్టాప్రింట్'లో వేకెన్సీ ఉన్నట్లు తెలుసుకున్నాడు. అయితే అందరి లాగా కేవలం తన రెజ్యుమ్‌ను ఆ కంపెనీ మెయిల్‌కి ఫార్వార్డ్ చేసి ఊరుకోలేదు. ఆ కంపెనీ గతంలో ముద్రించిన ఫ్లయర్స్  (సింగిల్ షీట్ ప్రింట్స్)ను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు. ఆపై అవే ఫ్లయర్స్‌పై తన రెజ్యుమ్‌ను ప్రింట్ చేశాడు.

ఆ తర్వాత ఒకానొక రోజు ఆ కంపెనీ పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లి... అక్కడ పార్క్ చేసి ఉన్న ప్రతీ కారుపై తన రెజ్యుమ్‌ను ముద్రించిన ఫ్లయర్స్‌ను ఉంచాడు. అలా ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ క్రెయిగ్ వాసెల్ దృష్టిలో పడ్డాడు. క్రెయిగ్ వెంటనే జొనాథన్‌ను ఇంటర్వ్యూకి పిలిపించగా... ప్రింటింగ్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోయాడు. దాదాపు 140 మంది ఆ ఉద్యోగానికి అప్లై చేయగా... డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ప్రయత్నించిన జొనాథన్‌కే ఉద్యోగం రావడం విశేషం. జొనాథన్ ఆ కంపెనీ పార్కింగ్ ప్రదేశంలోని కార్లపై తన రెజ్యుమ్ ముద్రించిన ఫ్లయర్స్‌‌ను ఉంచుతున్న వీడియోని (Viral Video) ఇన్‌స్టా‌ప్రింట్ కంపెనీ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Also Read: Budget 2022: రేపటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ సారి కాస్త ప్రత్యేకం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News