Donald Trump arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో న్యూయార్క్‌లోని కోర్టు ఎదుట డొనాల్డ్ ట్రంప్ లొంగిపోగా.. అమెరికా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా అరెస్ట్ అయిన ఒక అమెరికా మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్రకెక్కారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మ్యాన్‌హటన్ డిస్ట్రిక్ అటార్నీ ఆఫీసులో పోలీసుల అదుపులో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ రాకతో మ్యాన్‌హటన్ డిస్ట్రిక్ అటార్నీ ఆఫీసు పరిసరాలను భద్రతా బాలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మద్ధతుదారులు భారీ సంఖ్యలో న్యూయార్క్ చేరుకున్నారన్న సమాచారం నేపథ్యంలో.. ఆయనకు అనుకూలంగా నిరసన ర్యాలీలు చేపట్టకుండా న్యూయార్క్ నగర మేయర్ నగరంలో పలు ఆంక్షలు విధించారు.
వచ్చే ఏడాది జరగనున్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఎదుట హాజరై తనపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని కోర్టుకు విన్నవించుకునే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే డొనాల్డ్ ట్రంప్ మ్యాన్ హటన్ డిస్ట్రిక్ అటార్నీ ఆఫీసుకు వచ్చి లొంగిపోయినట్టు సమాచారం అందుతోంది. డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : Mysterious Disease: కరోనా కంటే డేంజర్ వైరస్.. 24 గంటల్లోనే ముక్కు నుంచి రక్తం కారుతూ ముగ్గురు మృతి
ఇది కూడా చదవండి : Ferry Fire Accident: ఫిలిప్పైన్స్‌లో పెను విషాదం.. 31 మంది దుర్మరణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK