Donald Trump: అమెరికాలో వాళ్లకు చోటు లేదు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Donald Trump: అమెరికాలో ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంలో గెలుపొందారు. అంతేకాదు మొత్తంగా స్వింగ్ స్టేట్స్ లో కూడా మొత్తంగా మెజారిటీ మార్క్ 270 సీట్ల కంటే ఎక్కువగా 312 సీట్ల గెలుపుతో సంచలనం సృష్టించారు. త్వరలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కక ముందే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 19, 2024, 10:57 AM IST
Donald Trump: అమెరికాలో వాళ్లకు చోటు లేదు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీదున్నారు. ఇప్పటికే అధ్యక్ష బాధ్యతలు చేపట్టలోపు తన అధికార యంత్రాంగాన్నిసమకూర్చుకుంటున్నారు. కీలక స్థానాల్లో తనకు అండగా నిలబడ్డ వాళ్లను సెలెక్ట్ చేస్తూ దూకుడు మీదున్నారు. జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే లోపు కీలక పనులు చక్కబెట్టేస్తున్నారు. తాజాగా అమెరికాలో అక్రమంగా చొరబడి చొరబాటుదారులకు స్థానం లేదని కుండబద్దలు కొట్టారు. మరోవైపు అమెరికాసరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ ఓ వ్యక్తి ట్రంప్ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’‌లో పోస్ట్ చేశాడు.

‘‘బైడెన్ హయాంలో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన అక్రమార్కులను సాగనంపుతారు. ఇందుకోసం అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటారని ఆ వ్యక్తి తన పోస్టులో చెప్పుకొచ్చాడు. దీనికి రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్.. ‘ట్రూ’ అని కామెంట్ పెట్టారు.
అమెరికా సరిహద్దుల భద్రత, విదేశీ వలసలకు సంబంధించిన వ్యవహారాలను చూసే కీలకమైన ‘బార్డర్ జార్’ పదవిని టామ్ హోమన్‌కు ట్రంప్ కేటాయించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టామ్ హోమన్ మాట్లాడుతూ.. బైడెన్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలోకి చొరబడి అక్రమంగా ఉంటున్న వాళ్లంతా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధం కావాలన్నారు. ఇప్పుడే లగేజీ సర్దుకోవడం మొదలుపెడితే బెటర్ అని కామెంట్ చేశారు. ఇటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తికి బార్డర్ జార్ పదవిని ట్రంప్ కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు తమదైన కామెంట్స్ చేస్తున్నారు. మరకొంత మంది అతని జాతీయవాదానికి మద్దతు తెలుపుతున్నారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x