Greece train crash Updates: గ్రీస్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 57కి చేరింది. 48 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన కాలిన గాయాల కారణంగా చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం 350 మందికి పైగా జనంతో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఎదురెదురుగా లారిస్సా నగరానికి సమీపంలోని టెంపిలో ఢీకొన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఈ మధ్య జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటి. ఈ ఘటనపై గ్రీస్‌లో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏథెన్స్‌లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆదేశ రవాణా మంత్రి రాజీనామా చేశారు. మృతి చెందిన వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా రస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి దేశవ్యాప్తంగా ప్రజలు పూలబొకేలతో సంతాపం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొవ్వొత్తుల ప్రదర్శనలు, ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనను 'విషాద మానవ తప్పిదం'గా గ్రీస్ ప్రధాని అభివర్ణించారు.
Also Read: Greece train crash: ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలు-కార్గో ట్రైన్ ఢీ.. 26 మంది మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook