Russia-Ukraine conflict: రష్యా (Russia) - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉక్రెయిన్‌లో (Ukraine) ఉన్న భారతీయ విద్యార్థులు (Indian students) ఆన్‌లైన్ క్లాసులపై సమాచారం కోసం ఎదురుచూడకుండా.. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అక్కడి భారత ఎంబసీ మంగళవారం అడ్వైజరీ జారీ చేసింది.
ADVISORY TO INDIAN STUDENTS IN UKRAINE.@MEAIndia @PIB_India @IndianDiplomacy @DDNewslive @PTI_News @IndiainUkraine pic.twitter.com/7pzFndaJpl
— India in Ukraine (@IndiainUkraine) February 22, 2022
''వైద్య విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ గురించి తెలుసుకోడానికి భారత ఎంబసీకి అధిక సంఖ్యలో పోన్లు వస్తున్నాయి. అయితే ఇండియన్ స్టూడెంట్స్ తమ విద్యను కొనసాగించేందుకు వీలుగా ఆన్‌లైన్ క్లాసుల ఏర్పాటుకు.. సంబంధిత అధికారులతో చర్చలు నడుస్తున్నాయి. క్లాసుల విషయంలో యూనివర్శిటీల నుంచి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురుచూడొద్దు. మీ సేఫ్టీ దృష్ట్యా వెంటనే ఉక్రెయిన్‌ను వీడాలని సూచిస్తున్నాం''’ అని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) స్పష్టం చేసింది.
స్వదేశానికి భారతీయులు
మరోవైపు ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి రప్పించేందుకుం కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. మూడు రోజుల పాటు ఎయిర్ఇండియా (Air india) ప్రత్యేక విమానాల ద్వారా వీరందరినీ స్వదేశానికి రప్పించనుంది. మంగళవారం రాత్రికి తొలి విమానం భారత్‌కు చేరుకుంటుంది. ఈ నెల 25 నుంచి మార్చి 6 మధ్య నాలుగు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. వీటితో పాటు యిర్ అరేబియా, ఎయిర్ దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్ లు భారత్-ఉక్రెయిన్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు కొనసాగిస్తాయి.
Advisory on Flights between India-Ukraine
as on 21 February 2022Kind attention: Students/Indian Nationals in Ukraine @MEAIndia @PIB_India @DDNewslive @IndianDiplomacy @PIBHindi pic.twitter.com/wUrI80IKVs
— India in Ukraine (@IndiainUkraine) February 21, 2022
Also Read: Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లో కాల్పుల మోత.. యుద్ధ సంకేతమేనా.. ఏం జరగబోతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook