రన్‌వేపైకి పరిగెత్తుకొచ్చిన యువకుడిని ఢీకొట్టిన విమానం !

రన్‌వేపైకి పరిగెత్తుకొచ్చిన యువకుడిని ఢీకొట్టిన విమానం !

Last Updated : Nov 22, 2018, 01:43 PM IST
రన్‌వేపైకి పరిగెత్తుకొచ్చిన యువకుడిని ఢీకొట్టిన విమానం !

మాస్కో: సాధారణంగా రోడ్డుపై దూసుకొచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతుండటం నిత్యం చూస్తుంటాం.. కానీ మంగళవారం రాత్రి మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయంలో జరిగిన ఓ ప్రమాదం మాత్రం ఇందుకు భిన్నమైంది మాత్రమే కాదు... వినడానికి కొంత విచిత్రమైంది కూడా. అవును మాస్కోలోని విమానాశ్రయంలో రన్‌వేపైకి పరిగెత్తుకొచ్చిన ఓ యువకుడిని టేకాఫ్ అవుతున్న విమానం ఢీకొన్న ఘటనలో అతడు మృతిచెందాడు. మాస్కో విమానాశ్రయం నుంచి ఏథెన్స్ బయల్దేరడానికి బోయింగ్‌ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలోనే అకస్మాత్తుగా ఆల్బర్ట్‌ ఎప్రెమ్‌యాన్‌(25) అనే యువకుడు రన్‌వేపైకి పరిగెత్తుకొచ్చాడు. అనుకోకుండా అడ్డంగా పరిగెత్తుకొచ్చిన ఆల్బర్ట్‌ను విమానం ల్యాండింగ్ గేర్ బలంగా తాకింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆల్బర్ట్ అక్కడే మృతిచెందాడు. 

ఆర్మేనియా దేశస్తుడైన ఆల్బర్ట్.. మ్యాడ్రిడ్ నుంచి మాస్కో వస్తున్న విమానంలో సిబ్బందితో గొడవపడి వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో మాస్కో విమానాశ్రయంలో దిగగానే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్మెనియా విమానం ఎక్కించేందుకు తీసుకెళ్తుండగా వారి నుంచి తప్పించుకుని రన్‌వే పైకి పరిగెత్తుకు రాగా అదే సమయంలో ఏథెన్స్‌కు వెళ్లేందుకు రన్‌వేపై టేకాఫ్ అవుతున్న బోయింగ్‌ 737 విమానం ఆల్బర్ట్‌ని ఢీకొట్టినట్టు విమానాశ్రయం అధికారిక వర్గాలు రష్యా న్యూస్ ఏజెన్సీ ఇంటర్‌ఫ్యాక్స్‌కి తెలిపాయి. 

అయితే, చీకట్లో రన్‌వేపై ఏం జరిగిందో అర్థం కాని విమానం సిబ్బంది.. తాము ఏదో జంతువును ఢీకొట్టినట్టుగా అనిపించిందని, దానిపై విచారణ జరిపించండని అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

Trending News