డిస్నీ పై కేసు పెట్టిన మైఖేల్ జాక్సన్ సంస్థ

ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఎస్టేట్.. మరో ప్రముఖ హాలీవుడ్ స్టూడియో వాల్ట్ డిస్నీపై కేసు పెట్టింది. 

Last Updated : May 31, 2018, 08:36 PM IST
డిస్నీ పై కేసు పెట్టిన మైఖేల్ జాక్సన్ సంస్థ

ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఎస్టేట్.. మరో ప్రముఖ హాలీవుడ్ స్టూడియో వాల్ట్ డిస్నీపై కేసు పెట్టింది. అందుకు ప్రధానమైన కారణం.. ఎంజే సాంగ్స్, వీడియోలను ఆ సంస్థ పర్మిషన్ లేకుండా వాడుకోవడమే. అయితే ఫెయిర్ యూజ్ పాలసీ ప్రకారమే ఒక చిన్న డాక్యుమెంటరీలో మాత్రమే ఆ సాంగ్స్ వాడామని డిస్నీ బదులిచ్చింది. అయితే దానికి ఎంజే సంస్థ గట్టిగానే బదులిచ్చింది. డిస్నీ వాదనలో పస లేదని.. ఆ సంస్థ కూడా ఎవరైనా పర్మిషన్ లేకుండా మిక్కీ మౌస్ వీడియో క్లిప్స్ వాడుకుంటే చూస్తూ ఊరుకుంటుందా..? అని ఎద్దేవా చేసింది.

ఈ మధ్యకాలంలో ఒరిజినల్ మేకర్స్‌ని సంప్రదించకుండా అనేక సంస్థలు కాపీరైటు హక్కులు ఉల్లంఘిస్తున్నాయని ఎంజే సంస్థ బదులిచ్చింది. డిస్నీ హిపోక్రసీతో వ్యవహరిస్తుందని తెలిపింది. అయితే డిస్నీ తరఫున మాట్లాడిన ఏబీసీ న్యూస్ కాపీరైటు నిబంధనలను తామెవ్వరం ఉల్లంఘించలేదిన పేర్కొంది. ఈ మధ్యకాలంలో ఇదే అంశం మీద లాస్ ఏంజెలీస్ ఫెడరల్ కోర్టులో ఎంజే ఎస్టేట్ లా సూట్ ఫైల్ చేసింది. డిస్నీ తమ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలను ఉచితంగా వాడుకోరాదని తెలిపింది. 

Trending News