'ఉగ్ర దేశాలకు గట్టిగా బుద్ధిచెప్పాలి': సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్

షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఒ) పీస్ మిషన్‌లో భారత్ పాల్గొంటుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

Last Updated : Apr 25, 2018, 05:43 PM IST
'ఉగ్ర దేశాలకు గట్టిగా బుద్ధిచెప్పాలి': సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్

షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఒ) పీస్ మిషన్‌లో భారత్ పాల్గొంటుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఏడాది రష్యాలో జరిగే సంయుక్త మిలిటరీ ఎక్సర్ సైజ్‌లో భారత్ పాల్గొంటుందని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. పాకిస్తాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించే విషయంలో రాజకీయ సాకులను చూపడం ఇకమీదట ఎంతమాత్రం సహించేది లేదని పేర్కొన్నారు. బీజింగ్‌లో నిన్న జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) మండలి రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం, సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంశాలను ప్రస్తావించారు. ఆఫ్ఘన్ భద్రత దేశాల సామర్థ్యం పెంపుకు సహకారంతో పాటు ఆ దేశంలో సుస్థిరతకు సహాయపడేదానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు.

అంతకు ముందు ఎస్‌సిఒ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, ఉగ్రవాదం మానవ మౌలిక హక్కులకు శత్రువని అన్నారు.  ప్రపంచం ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని, వాటిలో అతి ముఖ్యమైనది ఉగ్రవాదమని ఆమె అన్నారు. దీనిపై పోరాటానికి బలమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సహకరించే, ఆర్థికంగా ఆదుకునే దేశాలను గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ నిన్న బీజింగ్‌‌లో చైనా రక్షణ మంత్రి వై ఫెంఘేతో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత క్రమంలో ఇరు దేశాల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తకూడదని అన్నారు. సీతారామన్ సీఈవో మండలి సమావేశానికి హాజరు కావడం ద్వారా రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింత బలపడినట్లయిందని వై ఫెంఘే అన్నారు. ఇది ఎస్సీవో భద్రతా సహకారం పెంపునకు దోహదం చేస్తుందని అన్నారు. 

మంగళవారం చైనా పర్యటనను విజయవంతంగా ముగించుకొని సుష్మా స్వరాజ్ మంగోలియాకు వెళ్లారు. 6వ జాయింట్ కమిటీ ఫర్ కోఆపరేషన్‌లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా వాణిజ్య, వర్తక, పెట్టుబడి, శక్తి, మైనింగ్, జంతువుల పెంపకం, విద్య, పర్యాటక రంగాలపై చర్చలు సాగుతున్నాయి.

Trending News