Covid19 vaccine: ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో..

రష్యా, చైనా దేశాలు కరోనా వ్యాక్సిన్ సిద్ధమని ప్రకటించినా..ప్రపంచంలోని అత్యధిక దేశాల దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉన్న టీకాను డిసెంబర్లో అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Last Updated : Oct 26, 2020, 09:40 PM IST
  • తొలి విడత వ్యాక్సిన్ ను డిసెంబర్ నాటికి అందుబాటులో తెచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల ప్రయత్నం
  • ప్రస్తుతం మూడవ దశ ట్రయల్స్ లో ఉన్న ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్
  • ప్రపంచంలో అందరి దృష్టీ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పైనే
Covid19 vaccine: ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో..

రష్యా, చైనా దేశాలు కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) సిద్ధమని ప్రకటించినా..ప్రపంచంలోని అత్యధిక దేశాల దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford - Astrazeneca vaccine ) పైనే ఉంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉన్న టీకాను డిసెంబర్లో అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ ఈ యేడాది డిసెంబర్ కు అందుబాటులో రానుందా అంటే ఆక్స్‌ఫర్డ్‌ అవుననే అంటోంది. రష్యా ( Russia ) ఇప్పటికే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ( Sputnik v vaccine ) సిద్ధమని ప్రకటించింది. అటు చైనా సినోవ్యాక్ వ్యాక్సిన్ ( China sinovac ) ను పంపిణీకు సిద్ధం చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పైనే ఉంది. ఇదే వ్యాక్సిన్ కు సంబంధించిన ఉత్పత్తి, పంపిణీ బాధ్యత ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) తో జరిగింది. 

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం మూడో దశ పరీక్షలు ( oxford vaccine 3rd phase trials ) కొనసాగిస్తోంది. ప్రపంచంలో ఉన్న అవసరాల దృష్ట్యా వ్యాక్సిన్ ను డిసెంబర్ నాటికి అందుబాటులో తెచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక అనుమతిని క్రిస్మస్ నాటికి పొందేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసింది కంపెనీ. అయితే మూడవ దశ విజయవంతమైతేనే అధికారిక అనుమతి లభించనుండటంతో..ఆఖరి దశను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు పరిశోధకులు.

వ్యాక్సిన్ సిద్ధమైతే తొలి విడతలో వైరస్ ( Corona virus ) బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ..అదే వైరస్ బారిన పడుతున్న వైద్య సిబ్బందికి, వ్యాక్సిన్ అత్యవసరంగా అందించాల్సిన వృద్ధులకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే తొలి విడత వ్యాక్సిన్ ను డిసెంబర్ నాటికి అందుబాటులో తీసుకురావాలనేది ఆలోచనగా ఉంది. ఈ వ్యాక్సిన్‌ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ హిల్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

మరోవైపు మూడవ దశ ట్రయల్స్‌ పూర్తి కాకముందే మొదటి విడత వ్యాక్సిన్‌ డోసుల విడుదలకు అనుమతి కోరుతున్నామని, క్రిస్మస్‌లోగా అనుమతి వచ్చే అవకాశం ఉందని కూడా ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు చెబుతున్నారు. మూడవ ట్రయల్స్‌ పూర్తయ్యాక..ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు వ్యాక్సిన్ డోసుల్ని 2021 ప్రారంభంలో అందించే అవకాశాలున్నాయి. Also read: Bumper job: బిస్కెట్ రుచి కచ్చితంగా చెప్పగలరా..నెలకు 3 లక్షల జీతం మరి

Trending News