Supreme Court orders independent probe into Pegasus: దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని (Pegasus Probe Panel) ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని తెలిపింది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని పేర్కొంది. పెగాసస్‌పై (Pegasus) వచ్చిన ఆరోపణలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది. ఇక తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
Also Read : T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ?? ముందున్న సవాళ్లు..!!
తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. మనం సాంకేతిక శకంలో జీవిస్తున్నామని టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. వ్యక్తులకు సంబంధించిన గోప్యత హక్కును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొంది. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి (Central Government) నోటీసులు జారీ చేశామని తెలిపింది. దీనిపై తీసుకున్న చర్యలేంటో, వారి స్పందన ఏంటో సవివరంగా చెప్పేందుకు కేంద్రానికి అనేక అవకాశాలిచ్చామని చెప్పింది. స్పైవేర్‌ను ఉపయోగించామా లేదా అనే దానిపై కేంద్రం నుంచి కచ్చితమైన సమాధానం రాలేదని పేర్కొంది. కేంద్రం కూడా దీనిపై కమిటీ ఏర్పాటునకు సుముఖంగానే ఉంది అని ధర్మాసనం వివరించింది.
అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌తో (Pegasus) ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నాయంటూ కొన్ని కథనాలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు.
Also Read : Manchu Manoj: రెండో పెళ్లిపై మంచు మనోజ్ ట్వీట్..ఏం చెప్పారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook